నమ్మితి నీ మాటలకు నాయమేలయ్యా
(॥పల్లవి॥)
నమ్మితి నీ మాటలకు నాయమేలయ్యా
సమ్మతించిన పనికి సాకిరేలయ్యా
(॥నమ్మి॥)
ముచ్చటలు నాడితిరి మొదలనే నవ్వితిరి
తచ్చనలు మాతోడఁ దగదయ్యా
నిచ్చ నిచ్చ నీగుణాలు నే నెఱఁగని వున్నవా
అచ్చులౌదు రిన్నిటాను ఆనలేలయ్యా
(॥నమ్మి॥)
కను సన్న సేసితిరి కల్లలు నిజా లంటిరి
పిన్నదాన నాతోనేల పెనఁగేవయ్యా
పన్నిన నీ మాయలెల్లా బయలు నేఁ జేయనివా
నున్నని చెక్కులు మావి నొక్కకువయ్యా
(॥నమ్మి॥)
యేకతాలు నాడితిరి ఇందరి మెప్పించితిరి
మాకు మీకు నింత యెడమాఁట లేలయ్యా
కైకొని శ్రీ వేంకటేశ కందువ నన్నుఁ గూడితి
రేక చిత్తమాయ మీరు ఇట్టె వుండరయ్యా
(||pallavi||)
nammidi nī māḍalagu nāyamelayyā
sammadiṁchina panigi sāgirelayyā
(||nammi||)
muchchaḍalu nāḍidiri mŏdalane navvidiri
tachchanalu mādoḍam̐ dagadayyā
nichcha nichcha nīguṇālu ne nĕṟam̐gani vunnavā
achchulaudu rinniḍānu ānalelayyā
(||nammi||)
kanu sanna sesidiri kallalu nijā laṁṭiri
pinnadāna nādonela pĕnam̐gevayyā
pannina nī māyalĕllā bayalu nem̐ jeyanivā
nunnani sĕkkulu māvi nŏkkaguvayyā
(||nammi||)
yegadālu nāḍidiri iṁdari mĕppiṁchidiri
māgu mīgu niṁta yĕḍamām̐ṭa lelayyā
kaigŏni śhrī veṁkaḍeśha kaṁduva nannum̐ gūḍidi
rega sittamāya mīru iṭṭĕ vuṁḍarayyā