Nammidenu yaabe maamta naamaamte kaadaa

నమ్మితేను యాపె మాఁట నామాఁటే కాదా
Language

(॥పల్లవి॥)
నమ్మితేను యాపె మాఁట నామాఁటే కాదా
కమ్ముకొని సారెసారె గరిసించ నేఁటికి

(॥నమ్మి॥)
కన్నెమనసులోపలఁ గలిగినమాఁట లెల్ల
నిన్ననే విన్నవించనా నీతోను
చిన్నది గనక నీతో సిగ్గుపడి వున్నదిదె
యెన్న సిమారులు నీవు యేల వేఁడుకొనేవు

(॥నమ్మి॥)
చేకొని యాపెకు నీవు సేయఁగలపను లెల్ల
ఆకు వాసి యియ్యనా నీహస్తానకు
వాకుచ్చఁ జాలక తలవంచుకొని వున్నదిదె
యీకడఁ జప్పువంటా నీ వేల పెట్టే వానలు

(॥నమ్మి॥)
వున్నతి ని న్నాపె గోరుకున్న భావములెల్లాను
సన్నల నెచ్చరించనా సముకానను
మన్నించి శ్రీ వేంకటేశ మగువ నేలితి విట్టె
యెన్నరానివేడుకతో నెల వేగిరించేవు

(||pallavi||)
nammidenu yābĕ mām̐ṭa nāmām̐ṭe kādā
kammugŏni sārĕsārĕ garisiṁcha nem̐ṭigi

(||nammi||)
kannĕmanasulobalam̐ galiginamām̐ṭa lĕlla
ninnane vinnaviṁchanā nīdonu
sinnadi ganaga nīdo siggubaḍi vunnadidĕ
yĕnna simārulu nīvu yela vem̐ḍugŏnevu

(||nammi||)
segŏni yābĕgu nīvu seyam̐galabanu lĕlla
āgu vāsi yiyyanā nīhastānagu
vāguchcham̐ jālaga talavaṁchugŏni vunnadidĕ
yīgaḍam̐ jappuvaṁṭā nī vela pĕṭṭe vānalu

(||nammi||)
vunnadi ni nnābĕ gorugunna bhāvamulĕllānu
sannala nĕchchariṁchanā samugānanu
manniṁchi śhrī veṁkaḍeśha maguva nelidi viṭṭĕ
yĕnnarāniveḍugado nĕla vegiriṁchevu