Nammi koluvamgadaro narulaala shreeharini

నమ్మి కొలువఁగదరో నరులాల శ్రీహరిని
Language

(॥పల్లవి॥)
నమ్మి కొలువఁగదరో నరులాల శ్రీహరిని
కమ్మి యీతఁడే బ్రహ్మఁ గన్నతండ్రి గాఁడా

(॥నమ్మి॥)
దోసిట మడ్డెత్తేవేళ తోడై వచ్చే దైవము
రాసికెక్కఁ గొలిచితే రక్షింపఁడా
బాసలఁ బాము మంత్రము పంపు సెయించే దేవుఁ
డాసఁ దన్నుఁ దలఁచితే నటు పంపు సేయఁడా

(॥నమ్మి॥)
నాలిక గోసి పెట్టితే నలి మొలపించే దైవ
మేలికని కొలిచితే నీడేర్చఁడా
ఆలించి దారు శిలలఁ దా వహించే దేవుఁడు
వొలిఁ దనమనసులో నూహించితే లేఁడా

(॥నమ్మి॥)
పడినెడ మొక్కుకొన్నా వర మిచ్చే దేవుఁడు
కడు గరుడగంబముకాడ నియ్యఁడా
వెడ తీర్థయాత్రలకు వెస మెచ్చే దేవుఁడు
అడరి శ్రీవేంకటేశుఁ డండ నుంటే మెచ్చఁడా

(||pallavi||)
nammi kŏluvam̐gadaro narulāla śhrīharini
kammi yīdam̐ḍe brahmam̐ gannadaṁḍri gām̐ḍā

(||nammi||)
dosiḍa maḍḍĕtteveḽa toḍai vachche daivamu
rāsigĕkkam̐ gŏliside rakṣhiṁpam̐ḍā
bāsalam̐ bāmu maṁtramu paṁpu sĕyiṁche devum̐
ḍāsam̐ dannum̐ dalam̐side naḍu paṁpu seyam̐ḍā

(||nammi||)
nāliga gosi pĕṭṭide nali mŏlabiṁche daiva
meligani kŏliside nīḍersam̐ḍā
āliṁchi dāru śhilalam̐ dā vahiṁche devum̐ḍu
vŏlim̐ danamanasulo nūhiṁchide lem̐ḍā

(||nammi||)
paḍinĕḍa mŏkkugŏnnā vara michche devum̐ḍu
kaḍu garuḍagaṁbamugāḍa niyyam̐ḍā
vĕḍa tīrdhayātralagu vĕsa mĕchche devum̐ḍu
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍaṁḍa nuṁṭe mĕchcham̐ḍā