నమ్మవే చెలి ఇందుకు నాపూఁట
(॥పల్లవి॥)
నమ్మవే చెలి ఇందుకు నాపూఁట
వుమ్మడిఁ దలవంచుక వూరకుండనేలే
(॥నమ్మ॥)
తప్పక చూచినవాఁడు తానే యింటికి రాఁడటె
దప్పులఁ బొరలి యేల తమకించేవే
కప్పురాన వేసి తాను కాఁగిటఁ బొందకుండీనా
చిప్పిలుఁగాఁకల నీకుఁ జిన్నఁబోనేలే
(॥నమ్మ॥)
మాటలాడినవాఁడు మర్మము సోఁకించఁడటె
గాఁటపు విరహమునఁ గలఁగకువే
తేటగా నవ్విన తాను తేనెమోవి యొసఁగఁడా
చీటికి మాటికి నీకుఁ జింతించనేలే
(॥నమ్మ॥)
సేసలు వెట్టినవాఁడు సిగ్గులు దేరుచఁడటె
వేసాలకు నీవేల వెరగందేవే
ఆసల శ్రీ వేంకటేశుఁడంతలో నిన్నిట్టె కూడె
రాసికెక్కె వలపు వెరపు లెంచనేలే
(||pallavi||)
nammave sĕli iṁdugu nābūm̐ṭa
vummaḍim̐ dalavaṁchuga vūraguṁḍanele
(||namma||)
tappaga sūsinavām̐ḍu tāne yiṁṭigi rām̐ḍaḍĕ
dappulam̐ bŏrali yela tamagiṁcheve
kappurāna vesi tānu kām̐giḍam̐ bŏṁdaguṁḍīnā
sippilum̐gām̐kala nīgum̐ jinnam̐bonele
(||namma||)
māḍalāḍinavām̐ḍu marmamu som̐kiṁcham̐ḍaḍĕ
gām̐ṭabu virahamunam̐ galam̐gaguve
teḍagā navvina tānu tenĕmovi yŏsam̐gam̐ḍā
sīḍigi māḍigi nīgum̐ jiṁtiṁchanele
(||namma||)
sesalu vĕṭṭinavām̐ḍu siggulu derusam̐ḍaḍĕ
vesālagu nīvela vĕragaṁdeve
āsala śhrī veṁkaḍeśhum̐ḍaṁtalo ninniṭṭĕ kūḍĕ
rāsigĕkkĕ valabu vĕrabu lĕṁchanele