నమ్మవే నామాఁటలు నవ్వులు గావు
(॥పల్లవి॥)
నమ్మవే నామాఁటలు నవ్వులు గావు
పమ్మి నీ మీఁదఁ గడుబత్తి గలఁ డతఁడు
(॥నమ్మ॥)
చింతించ నీకేఁటికే చెక్కుచె య్యిదేఁటికే
వంతుకు నీరమణుఁడు వచ్చీఁగాక
సంతోసమే కలగిని సగినాలు మంచివయ్యా
వింతవేడుకనుద్దులే వినేవు నీవు
(॥నమ్మ॥)
యెకతాలాడనేఁటికే యెవ్వరిదూరినేఁటికే
కైకొని యాతఁడే నిన్నుఁ గలసీఁగాక
నీకోరిక లీడేరి నీవున్నదిక్కు మంచిది
జోక నన్నిసోబనాలు చూచేవు నీవు
(॥నమ్మ॥)
తలపోఁత లేఁటిక తలవంచనేఁటికే
యెలమి శ్రీవేంకటేశుఁ డేలె నిన్నును
వలపులు ఫలియించీ వచ్చినవేళ మంచిది
చెలరేఁగి సేవలింకాఁ జేసేవు నీవు
(||pallavi||)
nammave nāmām̐ṭalu navvulu gāvu
pammi nī mīm̐dam̐ gaḍubatti galam̐ ḍadam̐ḍu
(||namma||)
siṁtiṁcha nīgem̐ṭige sĕkkusĕ yyidem̐ṭige
vaṁtugu nīramaṇum̐ḍu vachchīm̐gāga
saṁtosame kalagini saginālu maṁchivayyā
viṁtaveḍuganuddule vinevu nīvu
(||namma||)
yĕgadālāḍanem̐ṭige yĕvvaridūrinem̐ṭige
kaigŏni yādam̐ḍe ninnum̐ galasīm̐gāga
nīgoriga līḍeri nīvunnadikku maṁchidi
joga nannisobanālu sūsevu nīvu
(||namma||)
talabom̐ta lem̐ṭiga talavaṁchanem̐ṭige
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnunu
valabulu phaliyiṁchī vachchinaveḽa maṁchidi
sĕlarem̐gi sevaliṁkām̐ jesevu nīvu