నమ్మవలెఁగాని యెన్నఁడు సందేహము లేక
(॥పల్లవి॥)
నమ్మవలెఁగాని యెన్నఁడు సందేహము లేక
యిమ్ముల దేవుఁడు వరమిచ్చు టేమరుదు
(॥నమ్మ॥)
మగనిపై బత్తిసేసి మంచిలోకా లెక్కేరట
తగుదండకోల వట్టి తత్త్వగతి గనేరట
పగటున నొకవేరు వట్టి పాముఁ బట్టేరట
తగిలి హరిదాసులు ధన్యు లౌ టేమరుదు
(॥నమ్మ॥)
యేలికెకు ధనమిచ్చి హితభోగా లందేరట
కేలఁ గత్తివూని పగ గెల్చేరట
గాలి లోలోఁ బూరించి ఘనసిద్ధు లయ్యేరట
యేలీల హరిదాసులు యీడేరు టేమరుదు
(॥నమ్మ॥)
దిక్కుల యజ్ఞాలు చేసి దివిజు లయ్యేరట
మొక్కి విప్రుల నర్చించి ముంచి సిరు లందేరట
పక్కన నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరుఁ
జక్కనఁ గొల్చిన దాసులు జ్ఞాను లౌ టేమరుదు
(||pallavi||)
nammavalĕm̐gāni yĕnnam̐ḍu saṁdehamu lega
yimmula devum̐ḍu varamichchu ṭemarudu
(||namma||)
maganibai battisesi maṁchilogā lĕkkeraḍa
tagudaṁḍagola vaṭṭi tattvagadi ganeraḍa
pagaḍuna nŏgaveru vaṭṭi pāmum̐ baṭṭeraḍa
tagili haridāsulu dhanyu lau ṭemarudu
(||namma||)
yeligĕgu dhanamichchi hidabhogā laṁderaḍa
kelam̐ gattivūni paga gĕlseraḍa
gāli lolom̐ būriṁchi ghanasiddhu layyeraḍa
yelīla haridāsulu yīḍeru ṭemarudu
(||namma||)
dikkula yajñālu sesi diviju layyeraḍa
mŏkki viprula narsiṁchi muṁchi siru laṁderaḍa
pakkana nalamelmaṁgabadi śhrīveṁkaḍeśhvarum̐
jakkanam̐ gŏlsina dāsulu jñānu lau ṭemarudu