నమ్మలేము కానలేము నరులాల మనమింతే
(॥పల్లవి॥)
నమ్మలేము కానలేము నరులాల మనమింతే
సమ్మతించి యేలేవాఁడు సర్వేశుఁడే సుండీ
(॥నమ్మ॥)
కంటికిఁ గంటిరెప్ప కాచుకవుండినయట్టు
వొంటి దేహమెల్లా జేవొడ్డుకొన్నట్టు
అంటుక దేహి నేపొద్దు అంతరాత్మయై వుండీ
జంటయై కాచుకున్నాఁడు సర్వేశుఁడే సుండీ
(॥నమ్మ॥)
చీఁకటి నోటికిఁ గడి చేయే కొంటవచ్చినట్టు
ఆఁకటికి గుక్కిళ్లు ఆసయినట్టు
వీఁకల జంతువులకు వెలుపల లోననుండి
సాఁకుచునున్నాఁ డిదివో సర్వేశుఁడే సుండీ
(॥నమ్మ॥)
తమదేహ మెంతైనా తానే యింపయి మోచినట్టు
తెమలి ప్రాణ మిన్నిటాఁ దీపయినట్టు
అమరిన భోగమోక్షా లడిగినవారి కిచ్చీ
సముఁడు శ్రీవేంకటాద్రి సర్వేశుఁడే సుండీ
(||pallavi||)
nammalemu kānalemu narulāla manamiṁte
sammadiṁchi yelevām̐ḍu sarveśhum̐ḍe suṁḍī
(||namma||)
kaṁṭigim̐ gaṁṭirĕppa kāsugavuṁḍinayaṭṭu
vŏṁṭi dehamĕllā jevŏḍḍugŏnnaṭṭu
aṁṭuga dehi nebŏddu aṁtarātmayai vuṁḍī
jaṁṭayai kāsugunnām̐ḍu sarveśhum̐ḍe suṁḍī
(||namma||)
sīm̐kaḍi noḍigim̐ gaḍi seye kŏṁṭavachchinaṭṭu
ām̐kaḍigi gukkiḽlu āsayinaṭṭu
vīm̐kala jaṁtuvulagu vĕlubala lonanuṁḍi
sām̐kusununnām̐ ḍidivo sarveśhum̐ḍe suṁḍī
(||namma||)
tamadeha mĕṁtainā tāne yiṁpayi mosinaṭṭu
tĕmali prāṇa minniḍām̐ dībayinaṭṭu
amarina bhogamokṣhā laḍiginavāri kichchī
samum̐ḍu śhrīveṁkaḍādri sarveśhum̐ḍe suṁḍī