Namdagadhara namdagobanamdana

నందకధర నందగోపనందన
Language

(॥పల్లవి॥)
నందకధర నందగోపనందన
కందర్పజనక కరుణాత్మన్

(॥నంద॥)
ముకుంద కేశవ మురహర
సకలాధిప పరమేశ్వర దేవేశ
శుకవరద సవితృ సుధాంశులోచన
ప్రకటవిభవ నమో పరమాత్మ

(॥నంద॥)
ధ్రువ పాంచాలీ స్తుతివత్సల మా
ధవ మధుసూదన ధరణిధరా
భువనత్రయ పరిపోషణ తత్పర
నవనీతప్రియ నాదాత్మ

(॥నంద॥)
శ్రీమన్ వేంకటశిఖరనివాస మ
హమహిమన్ నిఖిలాండపతే
కామితఫలభోగప్రద తే నమో
స్వామిన్ భూమన్ సర్వాత్మన్

(||pallavi||)
naṁdagadhara naṁdagobanaṁdana
kaṁdarbajanaga karuṇātman

(||naṁda||)
muguṁda keśhava murahara
sagalādhiba parameśhvara deveśha
śhugavarada savitṛ sudhāṁśhulosana
pragaḍavibhava namo paramātma

(||naṁda||)
dhruva pāṁchālī studivatsala mā
dhava madhusūdana dharaṇidharā
bhuvanatraya pariboṣhaṇa tatpara
navanīdapriya nādātma

(||naṁda||)
śhrīman veṁkaḍaśhikharanivāsa ma
hamahiman nikhilāṁḍabade
kāmidaphalabhogaprada te namo
svāmin bhūman sarvātman