నలువంక సతులెల్ల నవ్వేరాతని
(॥పల్లవి॥)
నలువంక సతులెల్ల నవ్వేరాతని
యెలమి నింతేసి బాయిట వేయఁదగునా
(॥నలు॥)
ఘనుఁడైన మగవానిఁ గాంతలెంత వలచిన
చెనకి కడుఁ బచ్చిగఁ జేయఁదగునా
పెనఁగుచు నాతఁడు తప్పించుకొనఁగానే నీవు
కనుపట్ట మోవిమీఁద గంటి సేయఁదగునా
(॥నలు॥)
దొరతనపు విభునిఁ దొయ్యలులెంత మీఱిన
సిరులఁ గొల్వునఁ గాకుసేయఁదగునా
పొరసి యాతఁడు నిన్ను బొమ్మల జంకించఁగానే
తొరలించి సంగడిపొందులు చూపఁదగునా
(॥నలు॥)
శ్రీ వేంకటేశ్వరునిఁ జెలులెంతాసోదమైన
సేవ సేసి సిగ్గువడఁ జేయఁదగునా
యీవల నాతఁడు నిన్ను నెనసి మెప్పించఁగానే
ఆవటపు రతులను అలయించఁదగునా
(||pallavi||)
naluvaṁka sadulĕlla navverādani
yĕlami niṁtesi bāyiḍa veyam̐dagunā
(||nalu||)
ghanum̐ḍaina magavānim̐ gāṁtalĕṁta valasina
sĕnagi kaḍum̐ bachchigam̐ jeyam̐dagunā
pĕnam̐gusu nādam̐ḍu tappiṁchugŏnam̐gāne nīvu
kanubaṭṭa movimīm̐da gaṁṭi seyam̐dagunā
(||nalu||)
dŏradanabu vibhunim̐ dŏyyalulĕṁta mīṟina
sirulam̐ gŏlvunam̐ gāguseyam̐dagunā
pŏrasi yādam̐ḍu ninnu bŏmmala jaṁkiṁcham̐gāne
tŏraliṁchi saṁgaḍibŏṁdulu sūbam̐dagunā
(||nalu||)
śhrī veṁkaḍeśhvarunim̐ jĕlulĕṁtāsodamaina
seva sesi sigguvaḍam̐ jeyam̐dagunā
yīvala nādam̐ḍu ninnu nĕnasi mĕppiṁcham̐gāne
āvaḍabu radulanu alayiṁcham̐dagunā