నలినాక్షుల కెల్లాను నవ్వు వచ్చీని
(॥పల్లవి॥)
నలినాక్షుల కెల్లాను నవ్వు వచ్చీని
పెలుచు సరసములఁ బెడరేఁచ కిపుడు
(॥నలి॥)
కలకలనగవులు కాఁతాళపుతగవులు
సలిపే వందరితోను సారెసారెకు
తెలిసెను నీజాడలు తేటతెల్లమిగాను
పలుకుల నిఁక నేమీఁ బచారించ కిపుడు
(॥నలి॥)
మంతనపుఁబ్రియములు మాటలలో నయములు
వింతులుగా నెరపేవు వీదులనెల్లా
దొంతులై నిలిచె నవె తొల్లె నీనేరుపులు
సంతలఁ బెట్టి యమ్మకు చాలుఁజాలు నిపుడు
(॥నలి॥)
జవ్వనపుమదములు సమరతి ముదములు
నివ్వటిల్లఁ జూపేవు నెమ్మది నీడ
ఇవ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
రవ్వలాయ వలపు పేరడిఁబెట్ట కిపుడు
(||pallavi||)
nalinākṣhula kĕllānu navvu vachchīni
pĕlusu sarasamulam̐ bĕḍarem̐sa kibuḍu
(||nali||)
kalagalanagavulu kām̐tāḽabudagavulu
salibe vaṁdaridonu sārĕsārĕgu
tĕlisĕnu nījāḍalu teḍadĕllamigānu
palugula nim̐ka nemīm̐ basāriṁcha kibuḍu
(||nali||)
maṁtanabum̐briyamulu māḍalalo nayamulu
viṁtulugā nĕrabevu vīdulanĕllā
dŏṁtulai nilisĕ navĕ tŏllĕ nīnerubulu
saṁtalam̐ bĕṭṭi yammagu sālum̐jālu nibuḍu
(||nali||)
javvanabumadamulu samaradi mudamulu
nivvaḍillam̐ jūbevu nĕmmadi nīḍa
ivvala śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
ravvalāya valabu peraḍim̐bĕṭṭa kibuḍu