Nalinaakshi imdarilo nagumbaadulaaya nemdu

నలినాక్షి ఇందరిలో నగుఁబాటులాయ నేఁడు
Language

(॥పల్లవి॥)
నలినాక్షి ఇందరిలో నగుఁబాటులాయ నేఁడు
యెలమి నీకే తెలుసు నేమిచెప్పే మిఁకను

(॥॥)
ఇచ్చగించి యాపె నీఇంటికి తానే వచ్చి
ముచ్చట మాటలాడి మొక్కు మొక్కెను
పచ్చిగా నాపెచెక్కుపై గోరుదీసి నీవు
రచ్చల బెట్టితి విదె రమణివలపులు

(॥॥)
చెంతల గొలువుసేసి చిత్తమురా విన్నవించి
పంతములెల్లా నిచ్చి పాదా లొతైను
వింతలుగా చన్నులపై వెలయ నచ్చువాఁసి
సంతలఁ బెట్టితివి సకియవలపులు

(॥॥)
కడుసిగ్గులు విడిచి కాగిట నిన్ను గలసి
బడిబడి నీవెంట బాయదాయను
అడరి శ్రీవేంకటేశ ఆపెమోవి గంటిసేసి
వడి నంగడివేసితి వనితవలపలు

(||pallavi||)
nalinākṣhi iṁdarilo nagum̐bāḍulāya nem̐ḍu
yĕlami nīge tĕlusu nemisĕppe mim̐kanu

(||||)
ichchagiṁchi yābĕ nīiṁṭigi tāne vachchi
muchchaḍa māḍalāḍi mŏkku mŏkkĕnu
pachchigā nābĕsĕkkubai gorudīsi nīvu
rachchala bĕṭṭidi vidĕ ramaṇivalabulu

(||||)
sĕṁtala gŏluvusesi sittamurā vinnaviṁchi
paṁtamulĕllā nichchi pādā lŏdainu
viṁtalugā sannulabai vĕlaya nachchuvām̐si
saṁtalam̐ bĕṭṭidivi sagiyavalabulu

(||||)
kaḍusiggulu viḍisi kāgiḍa ninnu galasi
baḍibaḍi nīvĕṁṭa bāyadāyanu
aḍari śhrīveṁkaḍeśha ābĕmovi gaṁṭisesi
vaḍi naṁgaḍivesidi vanidavalabalu