Nagumbaatlaayamgaa nalugurilona nellaa

నగుఁబాట్లాయఁగా నలుగురిలోన నెల్లా
Language

(॥పల్లవి॥)
నగుఁబాట్లాయఁగా నలుగురిలోన నెల్లా
తగవులు నీలోనే తలఁచుకో యిఁకను

(॥నగు॥)
యేకతాన నీవొక్కడ వింటిలోఁ బవ్వళించితే
ఆకడకెవ్వతో రాఁగా నలమితివి
చేకొని యెంతలో నాకె చెరఁగు మాసి వుండితే
సైకముగా శిరసు మజ్జనము సేసితివి

(॥నగు॥)
సింగారించుకొనేవేళ చెలి యటు పొలసితే
అంగవించి కూడి మోవి యానితివి
చెంగట నాపె యెంగిలిచేతితో నుండుట గని
సంగతిగాఁ గేళాకూళి జలక మాడితివి

(॥నగు॥)
తెరలో నుండినపుడు తెరవ తొంగి చూచితే
సరిఁ గూడితివి భూపతిచెరువు కాడ
అరసి శ్రీవేంకటేశ ఆపె చెమటలఁ దోఁగి
వొరసి నారతులలో నోలలాడితివి

(||pallavi||)
nagum̐bāṭlāyam̐gā nalugurilona nĕllā
tagavulu nīlone talam̐sugo yim̐kanu

(||nagu||)
yegadāna nīvŏkkaḍa viṁṭilom̐ bavvaḽiṁchide
āgaḍagĕvvado rām̐gā nalamidivi
segŏni yĕṁtalo nāgĕ sĕram̐gu māsi vuṁḍide
saigamugā śhirasu majjanamu sesidivi

(||nagu||)
siṁgāriṁchugŏneveḽa sĕli yaḍu pŏlaside
aṁgaviṁchi kūḍi movi yānidivi
sĕṁgaḍa nābĕ yĕṁgilisedido nuṁḍuḍa gani
saṁgadigām̐ geḽāgūḽi jalaga māḍidivi

(||nagu||)
tĕralo nuṁḍinabuḍu tĕrava tŏṁgi sūside
sarim̐ gūḍidivi bhūbadisĕruvu kāḍa
arasi śhrīveṁkaḍeśha ābĕ sĕmaḍalam̐ dom̐gi
vŏrasi nāradulalo nolalāḍidivi