Nagumbaadu livigonni nadubevugaaga yee

నగుఁబాటు లివిగొన్ని నడుపేవుగాక యీ
Language

(॥పల్లవి॥)
నగుఁబాటు లివిగొన్ని నడుపేవుగాక యీ-
అగడుఁ జేఁతలు సేసి ఆడిక కెక్కుదురా

(॥నగుఁ॥)
మగువనే కట్టుకొంటి మంగళసూత్రము గాను
యెగ సక్కేల గొల్లెత లేమందురో
జగములో నెవ్వరైనా సతులకుఁ బురుషులు
తగఁ గట్టుదురు గాక తాము గట్టుకొందురా

(॥నగుఁ॥)
ఆకె పుట్టినిల్లే నీకు నాకరము సేసుకొంటి
వీకడఁ బోఁదైనసతు లేమందురో
యేకమై తమసతుల యిల్లు నించుకొంటగాక
యేకడా ఘనులై నవా రిల్లిటము లుందురా

(॥నగుఁ॥)
అలమేలు మంగవల్ల నన్నిసిరులూ నందితి -
విల నీకూటపుసతు లేమందురో
కలవి శ్రీవేంకటేశ కాంతల కిత్తురు గాక
అలరి సతులసొమ్ము కాసపడఁజూతురా

(||pallavi||)
nagum̐bāḍu livigŏnni naḍubevugāga yī-
agaḍum̐ jem̐talu sesi āḍiga kĕkkudurā

(||nagum̐||)
maguvane kaṭṭugŏṁṭi maṁgaḽasūtramu gānu
yĕga sakkela gŏllĕda lemaṁduro
jagamulo nĕvvarainā sadulagum̐ buruṣhulu
tagam̐ gaṭṭuduru gāga tāmu gaṭṭugŏṁdurā

(||nagum̐||)
āgĕ puṭṭinille nīgu nāgaramu sesugŏṁṭi
vīgaḍam̐ bom̐dainasadu lemaṁduro
yegamai tamasadula yillu niṁchugŏṁṭagāga
yegaḍā ghanulai navā rilliḍamu luṁdurā

(||nagum̐||)
alamelu maṁgavalla nannisirulū naṁdidi -
vila nīgūḍabusadu lemaṁduro
kalavi śhrīveṁkaḍeśha kāṁtala kitturu gāga
alari sadulasŏmmu kāsabaḍam̐jūdurā