Nagudaa neeyichchagoddi nadadum gaaga

నగుతా నీయిచ్చకొద్ది నడతుఁ గాక
Language

(॥పల్లవి॥)
నగుతా నీయిచ్చకొద్ది నడతుఁ గాక
యెగసక్కెముగా నీతో యీసడించేనా

(॥నగు॥)
తలఁచుకో బాసలని తగవు నడపుమని
పలుమారు నీతోను పచారించేనా
పలుకు నమ్మితినని పాసితే దోసమని
సొలసి యొక్కతెవలె సోఁకనాడేనా

(॥నగు॥)
చిన్నదాన నేనని చెలులు దూరుదురని
కన్నచోటుల నే కరకరిఁ బెట్టేనా
నిన్ను నీవెంచుకొమ్మని నెపమేది లేదని
విన్నపాలుసేసి నిన్ను వేసరించేనా

(॥నగు॥)
కూడితివి నీవని కూరిమి చుట్టమనని
యీడా నాడా నేతులు నే నిటు చూపేనా
తోడనే శ్రీవేంకటేశ దొరయ నన్నేలితివి
వాడికె కిట్టె రాఁగా వలదనేనా

(||pallavi||)
nagudā nīyichchagŏddi naḍadum̐ gāga
yĕgasakkĕmugā nīdo yīsaḍiṁchenā

(||nagu||)
talam̐sugo bāsalani tagavu naḍabumani
palumāru nīdonu pasāriṁchenā
palugu nammidinani pāside dosamani
sŏlasi yŏkkadĕvalĕ som̐kanāḍenā

(||nagu||)
sinnadāna nenani sĕlulu dūrudurani
kannasoḍula ne karagarim̐ bĕṭṭenā
ninnu nīvĕṁchugŏmmani nĕbamedi ledani
vinnabālusesi ninnu vesariṁchenā

(||nagu||)
kūḍidivi nīvani kūrimi suṭṭamanani
yīḍā nāḍā nedulu ne niḍu sūbenā
toḍane śhrīveṁkaḍeśha dŏraya nannelidivi
vāḍigĕ kiṭṭĕ rām̐gā valadanenā