Naginagi paadudela naayamaa neegu

నగినగి పాడుటేల నాయమా నీకు
Language

(॥పల్లవి॥)
నగినగి పాడుటేల నాయమా నీకు
మగువ వూరకుంటే సమ్మతించుటగాక

(॥నగి॥)
చేయివట్టి తియ్యఁగాను చేసన్న వలెనా
చాయల నేఁజెప్పఁ గాను సాకిరి నేఅ
పాయపురమణి యెంత పక్కన నీచలమెంత
ఆయనాయ నే రమ్మంటే ఆకె యంటగాదా

(॥నగి॥)
వొంటిఁజిక్కివుండగాఁను వొడఁబాటు వలెనా
వెంటవెంట నే రాఁగా విన్నపాలేల
దంటతనము నీ కెంత తరుణివిరహ మెంత
అంటి నే నీకు మొక్కేది ఆకెపంపు గాదా

(॥నగి॥)
కాఁగిలించి వుండఁగాను కై మీరవలెనా
రాఁగి నరతివేళలో రవ్వలేల
సాగిన శ్రీవేంకటేశ పడఁతిఁ గూడితి విట్టె
ఆఁగి నిన్నుఁబోకుమంటే ఆకెంటగాదా

(||pallavi||)
naginagi pāḍuḍela nāyamā nīgu
maguva vūraguṁṭe sammadiṁchuḍagāga

(||nagi||)
seyivaṭṭi tiyyam̐gānu sesanna valĕnā
sāyala nem̐jĕppam̐ gānu sāgiri nea
pāyaburamaṇi yĕṁta pakkana nīsalamĕṁta
āyanāya ne rammaṁṭe āgĕ yaṁṭagādā

(||nagi||)
vŏṁṭim̐jikkivuṁḍagām̐nu vŏḍam̐bāḍu valĕnā
vĕṁṭavĕṁṭa ne rām̐gā vinnabālela
daṁṭadanamu nī kĕṁta taruṇiviraha mĕṁta
aṁṭi ne nīgu mŏkkedi āgĕbaṁpu gādā

(||nagi||)
kām̐giliṁchi vuṁḍam̐gānu kai mīravalĕnā
rām̐gi naradiveḽalo ravvalela
sāgina śhrīveṁkaḍeśha paḍam̐tim̐ gūḍidi viṭṭĕ
ām̐gi ninnum̐bogumaṁṭe āgĕṁṭagādā