Nagavimte yemaninaa naagum bovunaa

నగవింతే యేమనినా నాకుఁ బోవునా
Language

(॥పల్లవి॥)
నగవింతే యేమనినా నాకుఁ బోవునా
మొగమేడ అద్దమేడ ముచ్చటలుగావా

(॥నగ॥)
మగువ నాతో నలిగి మారుమంచ మెక్కినాను
తగిలి నామన సందు దగ్గరిరాదా
తగులుగలచోటికి దవ్వేమి చేరువేమి
మొగులేడ నీరేడ మొత్తమై తిరుగవా

(॥నగ॥)
పైపై నాచేత నన్ను బట్టనీక తోసినాను
చూపులైన నిన్ను నవి చుట్టుకొనవా
పాపరాదు పాలుగలపాయపువారిపొందు
తీపు లేడ పూవులేడ తేనెలై కురియవా

(॥నగ॥)
చాయపాట్తే నన్ను గూడి సరిమేను మఱచితే-
నేయెడ నారతిచేఁత లెచ్చరించవా
పాయరాదు శ్రీవేంకటపతినైననన్నును
రేయేడ పగలేడ రిచ్చల బైకొనవా

(||pallavi||)
nagaviṁte yemaninā nāgum̐ bovunā
mŏgameḍa addameḍa muchchaḍalugāvā

(||naga||)
maguva nādo naligi mārumaṁcha mĕkkinānu
tagili nāmana saṁdu daggarirādā
tagulugalasoḍigi davvemi seruvemi
mŏguleḍa nīreḍa mŏttamai tirugavā

(||naga||)
paibai nāseda nannu baṭṭanīga tosinānu
sūbulaina ninnu navi suṭṭugŏnavā
pābarādu pālugalabāyabuvāribŏṁdu
tību leḍa pūvuleḍa tenĕlai kuriyavā

(||naga||)
sāyabāṭte nannu gūḍi sarimenu maṟaside-
neyĕḍa nāradisem̐ta lĕchchariṁchavā
pāyarādu śhrīveṁkaḍabadinainanannunu
reyeḍa pagaleḍa richchala baigŏnavā