నడుమనే కంటిమి నీ నయగారాలు
(॥పల్లవి॥)
నడుమనే కంటిమి నీ నయగారాలు
వుడివోని కోరికల నున్నారు సతులు
(॥॥)
చేరి వోకతెతొడపై శిరసు మోపుకవుండి
యేరా పాదా లోకతెపై యిటు చాఁచేవు
యేరీతి నుండెనోకాని ఇద్దరి అడియాసలు
సారెకుఁజెమటలతో జడిసేరు సతులు
(॥॥)
మెక్కుచు మాటలాడేవు మునుపటియాకెతోడ
నిక్కపుఁజూపు లీపెపై నివాళించేవు
నిక్కుఁదమకము లెట్టు నెరపుకొన్నారోకాని
మిక్కిలి నిట్టూరుపుల మెరసేరు సతులు
(॥॥)
బలిమి శ్రీవెంకటేశ పట్టపుదేవుల నేలి
చెలఁగి కూడితి విట్టె చిన్న దానిని
నిలిచినరతుల నెట్టు నిన్ను మెప్పించిరోకాని
పులకమొలకలతోఁ బొదలేరు సతులు
(||pallavi||)
naḍumane kaṁṭimi nī nayagārālu
vuḍivoni korigala nunnāru sadulu
(||||)
seri vogadĕdŏḍabai śhirasu mobugavuṁḍi
yerā pādā logadĕbai yiḍu sām̐sevu
yerīdi nuṁḍĕnogāni iddari aḍiyāsalu
sārĕgum̐jĕmaḍalado jaḍiseru sadulu
(||||)
mĕkkusu māḍalāḍevu munubaḍiyāgĕdoḍa
nikkabum̐jūbu lībĕbai nivāḽiṁchevu
nikkum̐damagamu lĕṭṭu nĕrabugŏnnārogāni
mikkili niṭṭūrubula mĕraseru sadulu
(||||)
balimi śhrīvĕṁkaḍeśha paṭṭabudevula neli
sĕlam̐gi kūḍidi viṭṭĕ sinna dānini
nilisinaradula nĕṭṭu ninnu mĕppiṁchirogāni
pulagamŏlagaladom̐ bŏdaleru sadulu