నడుమఁ గాఁకలు చల్ల నాకేఁటికే
(॥పల్లవి॥)
నడుమఁ గాఁకలు చల్ల నాకేఁటికే
వెడ చనవులు సేయ వెఱ్ఱిదాననా
(॥నడు॥)
తెగి తామోహించినట్టి తెరవతో సారె సారె
నగుఁగాక కోపగించ నాకేఁటికే
మొగము చూచి యాపెకే మొక్కుఁగాక కమ్మటిని
వెగటు వెంగెములాడ వెఱ్ఱిదాననా
(॥నడు॥)
యేమగువయింటికైన నేఁగుగాక యిందుకుఁగా
నామోము చిన్నఁబోను నాకేఁటికే
మేము చూడఁగా నాకెను మెడఁ గట్టుకొనుఁగాక
వేమరుఁగాఁతాళించ వెఱ్ఱిదాననా
(॥నడు॥)
ఘనుఁడై పెండ్లాడినట్టికాంతఁ గాఁగిలించుకోఁగా
ననుపు లిప్పుడు సేయ నాకేఁటికే
యేనసి శ్రీవేంకటేశుఁ డింతలో నన్నాదరించీ
వెనకటిసుద్దు లెంచ వెఱ్ఱిదాననా
(||pallavi||)
naḍumam̐ gām̐kalu salla nāgem̐ṭige
vĕḍa sanavulu seya vĕṭridānanā
(||naḍu||)
tĕgi tāmohiṁchinaṭṭi tĕravado sārĕ sārĕ
nagum̐gāga kobagiṁcha nāgem̐ṭige
mŏgamu sūsi yābĕge mŏkkum̐gāga kammaḍini
vĕgaḍu vĕṁgĕmulāḍa vĕṭridānanā
(||naḍu||)
yemaguvayiṁṭigaina nem̐gugāga yiṁdugum̐gā
nāmomu sinnam̐bonu nāgem̐ṭige
memu sūḍam̐gā nāgĕnu mĕḍam̐ gaṭṭugŏnum̐gāga
vemarum̐gām̐tāḽiṁcha vĕṭridānanā
(||naḍu||)
ghanum̐ḍai pĕṁḍlāḍinaṭṭigāṁtam̐ gām̐giliṁchugom̐gā
nanubu lippuḍu seya nāgem̐ṭige
yenasi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannādariṁchī
vĕnagaḍisuddu lĕṁcha vĕṭridānanā