Naduma valasidenu navvemu nemu

నడుమ వలసితేను నవ్వేము నేము
Language

(॥పల్లవి॥)
నడుమ వలసితేను నవ్వేము నేము
చిడుముడి నిఁక మీరు సేసినట్టె చెల్లును

(॥॥)
మగువ కన్నుల మొక్కె మనసున దీవించు
యెగసక్కెమాడెనా యేమిచూచేవు
తగవరి యాపె నీవు తలఁపు కొద్దివాఁ డవు
జిగిమీర మీరిఁకఁ జేసినట్టె చెల్లును

(॥॥)
కొమ్మ నవ్వు గానుకిచ్చె గుట్టుననే అందుకో
పమ్మి నిన్ను దూరెనా భయమేఁటికి
వుమ్మడిఁ జెప్పెంపె నాపె వొడఁ బడితివి నీవు
చిమ్మిరేఁగి మీరిఁకఁ జేసినట్టె చెల్లును

(॥॥)
దేవులై కలలోఁ గూడె దిష్టమిట్టె సేవ చల్లు
మోవనాడెనా నన్ను ముట్టికూడేవు
వాపులు చెప్పెనాకె వసమయితివి నీవు
శ్రీ వేంకటేశ మీకుఁ జేసినట్టె చెల్లును

(||pallavi||)
naḍuma valasidenu navvemu nemu
siḍumuḍi nim̐ka mīru sesinaṭṭĕ sĕllunu

(||||)
maguva kannula mŏkkĕ manasuna dīviṁchu
yĕgasakkĕmāḍĕnā yemisūsevu
tagavari yābĕ nīvu talam̐pu kŏddivām̐ ḍavu
jigimīra mīrim̐kam̐ jesinaṭṭĕ sĕllunu

(||||)
kŏmma navvu gānugichchĕ guṭṭunane aṁdugo
pammi ninnu dūrĕnā bhayamem̐ṭigi
vummaḍim̐ jĕppĕṁpĕ nābĕ vŏḍam̐ baḍidivi nīvu
simmirem̐gi mīrim̐kam̐ jesinaṭṭĕ sĕllunu

(||||)
devulai kalalom̐ gūḍĕ diṣhṭamiṭṭĕ seva sallu
movanāḍĕnā nannu muṭṭigūḍevu
vābulu sĕppĕnāgĕ vasamayidivi nīvu
śhrī veṁkaḍeśha mīgum̐ jesinaṭṭĕ sĕllunu