Naduma ne mimmum joosi navvudum gaani

నడుమ నే మిమ్ముఁ జూచి నవ్వుదుఁ గాని
Language

(॥పల్లవి॥)
నడుమ నే మిమ్ముఁ జూచి నవ్వుదుఁ గాని
పడఁతి సవతి నీవు పతివి నాకు

(॥నడుమ॥)
సారె మీకిద్దరికి సంగాతాలు చేసేనా
చేరి యాపెకు బుద్దులు చెప్పమనేవు
తారుకాణగా మీకుఁ దగవులు దేర్చేనా
మేరతో వినుమనేవు మీ మాటలు

(॥నడుమ॥)
వొద్దనుండి మీకు నేను వూడిగాలు సేసేనా
కొద్దిమీర విడే లిచ్చి కూర్చు మనేవు
పెద్దగా నే వొజ్జలనై పెండ్లి మీకుఁ జేసేనా
పొద్దులు వేళలు నన్నే పూఁచి యడిగేవు

(॥నడుమ॥)
విందువలె నే మిమ్ము వియ్యము లందించేనా
కందువఁ జుట్టరికాలు కడుఁజెప్పేవు
అందపు శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
సందడి గిలిగించేనా సారెకూ నవ్వేవు

(||pallavi||)
naḍuma ne mimmum̐ jūsi navvudum̐ gāni
paḍam̐ti savadi nīvu padivi nāgu

(||naḍuma||)
sārĕ mīgiddarigi saṁgādālu sesenā
seri yābĕgu buddulu sĕppamanevu
tārugāṇagā mīgum̐ dagavulu dersenā
merado vinumanevu mī māḍalu

(||naḍuma||)
vŏddanuṁḍi mīgu nenu vūḍigālu sesenā
kŏddimīra viḍe lichchi kūrsu manevu
pĕddagā ne vŏjjalanai pĕṁḍli mīgum̐ jesenā
pŏddulu veḽalu nanne pūm̐si yaḍigevu

(||naḍuma||)
viṁduvalĕ ne mimmu viyyamu laṁdiṁchenā
kaṁduvam̐ juṭṭarigālu kaḍum̐jĕppevu
aṁdabu śhrīveṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
saṁdaḍi giligiṁchenā sārĕgū navvevu