Nadasee logamu brahmanaamtanumdi sahajamu

నడచీ లోకము బ్రహ్మనాఁటనుండి సహజము
Language

(॥పల్లవి॥)
నడచీ లోకము బ్రహ్మనాఁటనుండి సహజము
యెడయక శరణని యియ్యకొంటి సుఖము

(॥నడచి॥)
ఉదయాస్తమయములు వొక రన్నట్టయ్యీనా
చెదరి మేలునుఁ గీడు చెప్పినట్టు సేసీనా
యిది దైవకల్పితము యెవ్వరి నేమన వచ్చు
కదిసి యైనది యయ్యీ కాని దెన్నఁడుఁ గాదు

(॥నడచి॥)
జననములు మరణములు జంతువుల యిచ్చలా
వొనర కలిమిలేము లొక రన్న దౌనా
ఘనమైన హరిమాయకల్పితము లివి తొల్లె
పొనిఁగి పొయ్యే లీఁ బోవు పోని వెన్నఁడుఁ బోవు

(॥నడచి॥)
శ్రీవేంకటేశ నీవు సేసినసేఁతలోన
భావించి తెలియలేక భ్రమసితి మిన్నాళ్ళు
సావదానమున నిందు శరణంటిమి నీకు
యేవేళ మమ్ముఁ గాచితి విన్నిటా గెలిచితివి

(||pallavi||)
naḍasī logamu brahmanām̐ṭanuṁḍi sahajamu
yĕḍayaga śharaṇani yiyyagŏṁṭi sukhamu

(||naḍasi||)
udayāstamayamulu vŏga rannaṭṭayyīnā
sĕdari melunum̐ gīḍu sĕppinaṭṭu sesīnā
yidi daivagalbidamu yĕvvari nemana vachchu
kadisi yainadi yayyī kāni dĕnnam̐ḍum̐ gādu

(||naḍasi||)
jananamulu maraṇamulu jaṁtuvula yichchalā
vŏnara kalimilemu lŏga ranna daunā
ghanamaina harimāyagalbidamu livi tŏllĕ
pŏnim̐gi pŏyye līm̐ bovu poni vĕnnam̐ḍum̐ bovu

(||naḍasi||)
śhrīveṁkaḍeśha nīvu sesinasem̐talona
bhāviṁchi tĕliyalega bhramasidi minnāḽḽu
sāvadānamuna niṁdu śharaṇaṁṭimi nīgu
yeveḽa mammum̐ gāsidi vinniḍā gĕlisidivi