(॥పల్లవి॥)
నటనలు రెండూ నడపేవే
కుటిలపు నవ్వులుఁ గోపముఁ గలదా
(॥॥)
వదనకమల మిటు వంచేవేమే
చదురులమాఁటలు చల్లుచును
పెదవులు గదలగఁ బిలిచి గొణఁగేవే
చెదరనిపొందిటు సేయుచును
(॥॥)
చెక్కుచేతితో చింతయిదేమే
వొక్కమంచమున నుండుచును
మొక్కులలోనే ములిగేవేమే
చొక్కులచూపులఁ జూచుచును
(॥॥)
రతివేళనె యీరాజమేమే
అతిబాసలు నన్నడుగుచును
యితవుగ శ్రీ వేంకటేశుఁడఁ గూడితి
మతకములేలే మైమఱచుచును
(||pallavi||)
naḍanalu rĕṁḍū naḍabeve
kuḍilabu navvulum̐ gobamum̐ galadā
(||||)
vadanagamala miḍu vaṁcheveme
sadurulamām̐ṭalu sallusunu
pĕdavulu gadalagam̐ bilisi gŏṇam̐geve
sĕdaranibŏṁdiḍu seyusunu
(||||)
sĕkkusedido siṁtayideme
vŏkkamaṁchamuna nuṁḍusunu
mŏkkulalone muligeveme
sŏkkulasūbulam̐ jūsusunu
(||||)
radiveḽanĕ yīrājameme
adibāsalu nannaḍugusunu
yidavuga śhrī veṁkaḍeśhum̐ḍam̐ gūḍidi
madagamulele maimaṟasusunu