Naayeda neevidu nadabi nannatte

నాయెడ నీవిటు నడపి నన్నట్టె
Language

(॥పల్లవి॥)
నాయెడ నీవిటు నడపి నన్నట్టె
చాయకుఁ దెచ్చుకో సరసపు విభుడా

(॥నాయె॥)
మట్టుమీరినట్టిమాసటీలకును
పట్టినవెల్లాఁ బంతములే
చుట్టరికంబున సోఁకోర్చువారికి
తిట్టినతిట్టులు దీవనలే

(॥నాయె॥)
కొనలకు నెక్కిన కోపపువారికి
పెనఁగినవెల్లా బీరములే
చనవులు మిగిలిన శాంతపువారికి
గునిసిన వన్నియుఁ గూరుములే

(॥నాయె॥)
మలకల మలకల మంకుల వారికి
అలిగినవెల్లా నాయములే
చెలఁ గిదె మనకును శ్రీవేంకటేశ్వర
మలసినకూటమి మర్మములే

(||pallavi||)
nāyĕḍa nīviḍu naḍabi nannaṭṭĕ
sāyagum̐ dĕchchugo sarasabu vibhuḍā

(||nāyĕ||)
maṭṭumīrinaṭṭimāsaḍīlagunu
paṭṭinavĕllām̐ baṁtamule
suṭṭarigaṁbuna som̐korsuvārigi
tiṭṭinadiṭṭulu dīvanale

(||nāyĕ||)
kŏnalagu nĕkkina kobabuvārigi
pĕnam̐ginavĕllā bīramule
sanavulu migilina śhāṁtabuvārigi
gunisina vanniyum̐ gūrumule

(||nāyĕ||)
malagala malagala maṁkula vārigi
aliginavĕllā nāyamule
sĕlam̐ gidĕ managunu śhrīveṁkaḍeśhvara
malasinagūḍami marmamule