నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన
(॥పల్లవి॥)
నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన
చాయపాటు బుద్ధులకే శరణంటి నిన్నును
(॥నాయంత॥)
విన్నపము సేసేనంటే వేళ నీ కేదో యెఱుఁగ
మన్నించుకొలఁదీ నీ మన సెఱుఁగ
సన్నుతించే నంటేను చక్కనిమాట లెఱుఁగ
నన్ను నెట్టు రక్షించేవో నమ్మితి నే మిమ్మును
(॥నాయంత॥)
సేవచేసి నిన్ను మెప్పించేనంటే భక్తి నేర
నీవాఁడనై కొల్చేనంటే నేమము నేర
పూవులఁ బూజించేనంటే పొందగు మంత్రము నేర
దైవమా నీవే దిక్కు ధరించితి ముద్రలు
(॥నాయంత॥)
హితవరి నయ్యేనంటే నేకాంతము దెలియ
మతిఁ దలఁచేనంటే మర్మము దెలియ
సతమై శ్రీవేంకటేశ్వర నీవే నాకు
గతి యని మొక్కితిఁ గరుణించే దెట్లో
(||pallavi||)
nāyaṁta jñānamu ledu nāgu māvāru sĕppina
sāyabāḍu buddhulage śharaṇaṁṭi ninnunu
(||nāyaṁta||)
vinnabamu sesenaṁṭe veḽa nī kedo yĕṟum̐ga
manniṁchugŏlam̐dī nī mana sĕṟum̐ga
sannudiṁche naṁṭenu sakkanimāḍa lĕṟum̐ga
nannu nĕṭṭu rakṣhiṁchevo nammidi ne mimmunu
(||nāyaṁta||)
sevasesi ninnu mĕppiṁchenaṁṭe bhakti nera
nīvām̐ḍanai kŏlsenaṁṭe nemamu nera
pūvulam̐ būjiṁchenaṁṭe pŏṁdagu maṁtramu nera
daivamā nīve dikku dhariṁchidi mudralu
(||nāyaṁta||)
hidavari nayyenaṁṭe negāṁtamu dĕliya
madim̐ dalam̐senaṁṭe marmamu dĕliya
sadamai śhrīveṁkaḍeśhvara nīve nāgu
gadi yani mŏkkidim̐ garuṇiṁche dĕṭlo