నాయకుఁడే ఇంతసేసె నా మోహము
(॥పల్లవి॥)
నాయకుఁడే ఇంతసేసె నా మోహము
పాయరాని భాగ్యముల పంతపు నా మోహము
(॥నాయ॥)
చవులుగా నీతోను సరసము లాడించె
నవకపువిధముల నా మోహము
చివురువంటి నాచేతు లెత్తి మొక్కించె
సవరఁదనముల నా జవ్వనపు మోహము
(॥నాయ॥)
తగిన విరహవేళ దయ వుట్టించెను నీకు
నగవు సమేళముల నా మోహము
మగటిమి నీచేతి మన్ననలు చేకూర్చె
నిగిడి నామతిలోన నిండుకొన్న మోహము
(॥నాయ॥)
రయమున నీ కాఁగిటిరసములు గురియించె
నయగారితనములనామోహము
నియతి శ్రీ వేంకటేశ నిన్ను నాతోఁ గూడించె
ప్రియముల నేపొద్దుఁ బెనఁగే నా మోహము
(||pallavi||)
nāyagum̐ḍe iṁtasesĕ nā mohamu
pāyarāni bhāgyamula paṁtabu nā mohamu
(||nāya||)
savulugā nīdonu sarasamu lāḍiṁchĕ
navagabuvidhamula nā mohamu
sivuruvaṁṭi nāsedu lĕtti mŏkkiṁchĕ
savaram̐danamula nā javvanabu mohamu
(||nāya||)
tagina virahaveḽa daya vuṭṭiṁchĕnu nīgu
nagavu sameḽamula nā mohamu
magaḍimi nīsedi mannanalu segūrsĕ
nigiḍi nāmadilona niṁḍugŏnna mohamu
(||nāya||)
rayamuna nī kām̐giḍirasamulu guriyiṁchĕ
nayagāridanamulanāmohamu
niyadi śhrī veṁkaḍeśha ninnu nādom̐ gūḍiṁchĕ
priyamula nebŏddum̐ bĕnam̐ge nā mohamu