నాయకుఁడ నీ చిత్తము నా భాగ్యము
(॥పల్లవి॥)
నాయకుఁడ నీ చిత్తము నా భాగ్యము
పాయపుఁ జక్కఁదనాన పాయకుందుఁ గాక
(॥నాయ॥)
వీనులఁ బొంచుకుండితి వేడుకనీమాటలకు
ఆనుకొని సరసము లాడవైతివి
నేనా నిన్నుఁ గొసరి నెప్పునకుఁ దెచ్చేదాన
మోనముతోఁ జేతులెత్తి మొక్కఁగలఁగాక
(॥నాయ॥)
కన్నులఁ గాచుకుండితి కదిసి నీమాటలకు
నిన్ననే రావైతివి నీయంతను
నన్నువంటిదా నిన్ను నయానకుఁ దీసేది
పన్నిననీపాదుకులు పట్టఁగలఁగాక
(॥నాయ॥)
చేతులు చాఁచుకుండితి శ్రీవేంకటేశ్వర నీకు
యీతల నన్నుఁ గూడితి విందుకుఁగానే
ఘాతల మాతరమా కరగించ నీమనసు
నీతితో నాతమకము నించఁగలఁగాక
(||pallavi||)
nāyagum̐ḍa nī sittamu nā bhāgyamu
pāyabum̐ jakkam̐danāna pāyaguṁdum̐ gāga
(||nāya||)
vīnulam̐ bŏṁchuguṁḍidi veḍuganīmāḍalagu
ānugŏni sarasamu lāḍavaidivi
nenā ninnum̐ gŏsari nĕppunagum̐ dĕchchedāna
monamudom̐ jedulĕtti mŏkkam̐galam̐gāga
(||nāya||)
kannulam̐ gāsuguṁḍidi kadisi nīmāḍalagu
ninnane rāvaidivi nīyaṁtanu
nannuvaṁṭidā ninnu nayānagum̐ dīsedi
panninanībādugulu paṭṭam̐galam̐gāga
(||nāya||)
sedulu sām̐suguṁḍidi śhrīveṁkaḍeśhvara nīgu
yīdala nannum̐ gūḍidi viṁdugum̐gāne
ghādala mādaramā karagiṁcha nīmanasu
nīdido nādamagamu niṁcham̐galam̐gāga