నాయకుడు సన్నసేసీ నన్ను నీతోఁ జెప్పుమని
(॥పల్లవి॥)
నాయకుడు సన్నసేసీ నన్ను నీతోఁ జెప్పుమని
కాయముఁ గాయము మోచె కడమ లింకేఁటికి
(॥నాయ॥)
పగడవాతెరమోవిఁ బలుకవే పతితోడ
జిగిమించ మంచమెక్కి సిగ్గులేఁటికి
మొగమెత్తి చూడవే ముచ్చటలు దైవార
తగులాయ నేస్తములు తల వంచనేఁటికి
(॥నాయ॥)
గట్టినీచన్నుల నొత్తి కాఁగిలించుకొనవే
చుట్టరికము గలసె సుద్దులేఁటికి
నెట్టుకొని నవ్వవే నేరుపులెల్లా మించ
దట్టమాయఁ దమకము తాలిము లిఁకేఁటికి
(॥నాయ॥)
సోలయుచు మోవి యిచ్చి చోక్కించఁగదవే
తలకొన్న వలపులు దాఁచనేఁటికి
అలమె శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
కలసితివి మెచ్చవే కడుగుట్టులేఁటికి
(||pallavi||)
nāyaguḍu sannasesī nannu nīdom̐ jĕppumani
kāyamum̐ gāyamu mosĕ kaḍama liṁkem̐ṭigi
(||nāya||)
pagaḍavādĕramovim̐ balugave padidoḍa
jigimiṁcha maṁchamĕkki siggulem̐ṭigi
mŏgamĕtti sūḍave muchchaḍalu daivāra
tagulāya nestamulu tala vaṁchanem̐ṭigi
(||nāya||)
gaṭṭinīsannula nŏtti kām̐giliṁchugŏnave
suṭṭarigamu galasĕ suddulem̐ṭigi
nĕṭṭugŏni navvave nerubulĕllā miṁcha
daṭṭamāyam̐ damagamu tālimu lim̐kem̐ṭigi
(||nāya||)
solayusu movi yichchi sokkiṁcham̐gadave
talagŏnna valabulu dām̐sanem̐ṭigi
alamĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
kalasidivi mĕchchave kaḍuguṭṭulem̐ṭigi