నావంటివారెందరున్నా నయమే నీకు
(॥పల్లవి॥)
నావంటివారెందరున్నా నయమే నీకు
పూవువలె భోగించితే పుణ్యములే చేరును
(॥నావం॥)
వాసులువంతు లెంచక వద్దనున్నదానను
వేసరకుమీ నీవెలఁది నేను
ఆసపడ్డవారిమతి అక్కరదీరిచితేను
దోసములే దిందువంక తొయ్యలులు మెత్తురు
(॥నావం॥)
సిగ్గులువడక నీపైఁ జేతులు నేఁ జాఁచితే
యెగ్గులు వట్టకుమీ నీయింతిని నేను
వొగ్గినవారిచనవు లొనరఁ జెల్లించి తేను
తగ్గుమొగ్గులేదు నీదయ లోకు లెంతురు
(॥నావం॥)
అలపుచూడక నిన్ను అట్టె కాఁగిలించితి
బలిమి సేయకుమీ నీపడఁతి నేను
చెలఁగి నన్నేలితివి శ్రీవేంకటేశ నీవు
సిలుగులేదు నిన్నుఁ జేరి నేఁ బొగడుదు
(||pallavi||)
nāvaṁṭivārĕṁdarunnā nayame nīgu
pūvuvalĕ bhogiṁchide puṇyamule serunu
(||nāvaṁ||)
vāsuluvaṁtu lĕṁchaga vaddanunnadānanu
vesaragumī nīvĕlam̐di nenu
āsabaḍḍavārimadi akkaradīrisidenu
dosamule diṁduvaṁka tŏyyalulu mĕtturu
(||nāvaṁ||)
sigguluvaḍaga nībaim̐ jedulu nem̐ jām̐side
yĕggulu vaṭṭagumī nīyiṁtini nenu
vŏgginavārisanavu lŏnaram̐ jĕlliṁchi tenu
taggumŏgguledu nīdaya logu lĕṁturu
(||nāvaṁ||)
alabusūḍaga ninnu aṭṭĕ kām̐giliṁchidi
balimi seyagumī nībaḍam̐ti nenu
sĕlam̐gi nannelidivi śhrīveṁkaḍeśha nīvu
siluguledu ninnum̐ jeri nem̐ bŏgaḍudu