Naavamti sadulu tana nagara nemdaru lere

నావంటి సతులు తన నగర నెందరు లేరే
Language

(॥పల్లవి॥)
నావంటి సతులు తన నగర నెందరు లేరే
భావమున తనుఁ దలచి బతికే నేనూ

(॥నావంటి॥)
తగుల వలచుటె కాని తప్పు సేయట లేదు
జిగి నేల పిలిచీనె చెప్పఁ గదరే
అగడు నేయఁగ మిమ్ము నంపెనా నేఁ డతఁడు
నగుఁబాటు గాక తనకు నాకుఁ బని యేమే

(॥నావంటి॥)
నవ్వు టొక్కటె కాని ననుపు దొంగిలితేను
రవ్వ నాకడకుఁ దా రా నేఁటికే
వువ్విళ్ల నిది వూరకుండ నే లనుచునా
అవ్విభఁడు చలముకొనె నాఁడుగోల యేలే

(॥నావంటి॥)
యిచ్చ లాడుట గాని యెందు వోతి వన లేదు
పచ్చిగా నా చెరఁగు పట్ట నేలే
అచ్చలాన శ్రీవెంకటాదిపుఁడు నన్నుఁ గూడె
తచ్చన లింతే కాక తానే నేఁ గానా

(||pallavi||)
nāvaṁṭi sadulu tana nagara nĕṁdaru lere
bhāvamuna tanum̐ dalasi badige nenū

(||nāvaṁṭi||)
tagula valasuḍĕ kāni tappu seyaḍa ledu
jigi nela pilisīnĕ sĕppam̐ gadare
agaḍu neyam̐ga mimmu naṁpĕnā nem̐ ḍadam̐ḍu
nagum̐bāḍu gāga tanagu nāgum̐ bani yeme

(||nāvaṁṭi||)
navvu ṭŏkkaḍĕ kāni nanubu dŏṁgilidenu
ravva nāgaḍagum̐ dā rā nem̐ṭige
vuvviḽla nidi vūraguṁḍa ne lanusunā
avvibham̐ḍu salamugŏnĕ nām̐ḍugola yele

(||nāvaṁṭi||)
yichcha lāḍuḍa gāni yĕṁdu vodi vana ledu
pachchigā nā sĕram̐gu paṭṭa nele
achchalāna śhrīvĕṁkaḍādibum̐ḍu nannum̐ gūḍĕ
tachchana liṁte kāga tāne nem̐ gānā