నావంటి సతులే నన్ను మెత్తురు
(॥పల్లవి॥)
నావంటి సతులే నన్ను మెత్తురు
భావించ నీకే నేను బాఁతిగాఁ గాని
(॥నావం॥)
చిన్నదాననైనా నీచిత్తము రా సేవసేతు
నన్ను నే పొగడుకొన నాయము గాదు
వున్నతినీచేఁతలకు వోరుతు నెంతేసికైనా
యెన్నిక నీతో నేను యీడురాఁగాని
(॥నావం॥)
కడుగర్వినైనా నీకతలకెల్లా లోను
బడిబడి విన్నవించఁ బాడిగాదు
యెడయక యిచ్చకాన నెప్పుడూ నీవద్దనుందు
ముడిమాఁటలను నీపై మోపుగట్టఁగాని
(॥నావం॥)
పట్టపుదేవినైనా నీపలుకులెనె నడతు
దట్టించి నీ కెచ్చరించఁ దగవుగాదు
యిట్టె శ్రీవేంకటేశ యెనసితి నిట్లు నిన్ను
ఱట్టడితనాన నే నాఱడిసేయఁగాని
(||pallavi||)
nāvaṁṭi sadule nannu mĕtturu
bhāviṁcha nīge nenu bām̐tigām̐ gāni
(||nāvaṁ||)
sinnadānanainā nīsittamu rā sevasedu
nannu ne pŏgaḍugŏna nāyamu gādu
vunnadinīsem̐talagu vorudu nĕṁtesigainā
yĕnniga nīdo nenu yīḍurām̐gāni
(||nāvaṁ||)
kaḍugarvinainā nīgadalagĕllā lonu
baḍibaḍi vinnaviṁcham̐ bāḍigādu
yĕḍayaga yichchagāna nĕppuḍū nīvaddanuṁdu
muḍimām̐ṭalanu nībai mobugaṭṭam̐gāni
(||nāvaṁ||)
paṭṭabudevinainā nībalugulĕnĕ naḍadu
daṭṭiṁchi nī kĕchchariṁcham̐ dagavugādu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidi niṭlu ninnu
ṟaṭṭaḍidanāna ne nāṟaḍiseyam̐gāni