Naavamkam gadama ledu naamdu nemdu

నావంకఁ గడమ లేదు నాఁడు నేఁడు
Language

(॥పల్లవి॥)
నావంకఁ గడమ లేదు నాఁడు నేఁడు
భావించితే నీతో నేను పంతమాడే దాననా

(॥॥)
కొత్తలు నేర్చుకొంటివి కొంగువట్టి పెనఁగేవు
చిత్తము వచ్చినట్టె ల్లాఁ జేయవయ్య
బొత్తుగా నీ వాపె చేత బుద్దులు వినఁగాఁగాక
హత్తి నీతో నేఁ దొల్లి అలిగితినా

(॥॥)
సంకె లేదేమిటా నీకు సారె నొడఁ బరచేవు
అంకెకు వచ్చినట్టల్లా నానతీవయ్యా
లంకెయై నీ వాపె వలలఁ జిక్కిఁగాఁగాక
మంకుఁదనాన నే నీతో మారుకొనఁగలనా

(॥॥)
మేను ముట్టి నాతో నీవు మేలము లాడవచ్చేవు
నానా విధాల నీవు నవ్వవయ్యా
మోనాన నన్నేలి యాపెమోము చూడఁగాఁ గాక
ఆనుక శ్రీవేంకటేశ అవుఁగా దనేనా

(||pallavi||)
nāvaṁkam̐ gaḍama ledu nām̐ḍu nem̐ḍu
bhāviṁchide nīdo nenu paṁtamāḍe dānanā

(||||)
kŏttalu nersugŏṁṭivi kŏṁguvaṭṭi pĕnam̐gevu
sittamu vachchinaṭṭĕ llām̐ jeyavayya
bŏttugā nī vābĕ seda buddulu vinam̐gām̐gāga
hatti nīdo nem̐ dŏlli aligidinā

(||||)
saṁkĕ ledemiḍā nīgu sārĕ nŏḍam̐ barasevu
aṁkĕgu vachchinaṭṭallā nānadīvayyā
laṁkĕyai nī vābĕ valalam̐ jikkim̐gām̐gāga
maṁkum̐danāna ne nīdo mārugŏnam̐galanā

(||||)
menu muṭṭi nādo nīvu melamu lāḍavachchevu
nānā vidhāla nīvu navvavayyā
monāna nanneli yābĕmomu sūḍam̐gām̐ gāga
ānuga śhrīveṁkaḍeśha avum̐gā danenā