Naavamka dosamu ledu nalinaakshulaala meeru

నావంక దోసము లేదు నలినాక్షులాల మీరు
Language

(॥పల్లవి॥)
నావంక దోసము లేదు నలినాక్షులాల మీరు
కేవలమై ఇందుకు సాకిరి సుండీ ఇపుడు

(॥నావం॥)
విందులు చెప్పవచ్చిన వెలది మోవి తీపంటా
అందుకొని చవిగొనీ నదివోతాను
ఇందు కిట్టె తమయక్క యెరిఁగితే నేమియను
ముంద రెరఁగఁడు తాను మొక్కలీఁడు చూడరే

(॥నావం॥)
నిమ్మపండ్లు చేతీరే గానియ్యఁగా నాచన్నులె
నిమ్మపండ్లు మంచివంటా నిక్కి తినీనే
వుమ్మడినీసుద్దులు మాయమ్మ వింటేనేమియను
కొమ్మలాల యీతఁడు కక్కూర్తికాఁడు గదరే

(॥నావం॥)
చేరి పిల్వవచ్చిననెచ్చెలి తనవేడుకంటా
యీరీతి నన్ను శ్రీవేంకటేశుఁడు గూడె
సారె నిది మాయేలికెసాని వింటే నేమియను
కారుకొన్నజాణకాఁడుగదరె నేఁడితఁడు

(||pallavi||)
nāvaṁka dosamu ledu nalinākṣhulāla mīru
kevalamai iṁdugu sāgiri suṁḍī ibuḍu

(||nāvaṁ||)
viṁdulu sĕppavachchina vĕladi movi tībaṁṭā
aṁdugŏni savigŏnī nadivodānu
iṁdu kiṭṭĕ tamayakka yĕrim̐gide nemiyanu
muṁda rĕram̐gam̐ḍu tānu mŏkkalīm̐ḍu sūḍare

(||nāvaṁ||)
nimmabaṁḍlu sedīre gāniyyam̐gā nāsannulĕ
nimmabaṁḍlu maṁchivaṁṭā nikki tinīne
vummaḍinīsuddulu māyamma viṁṭenemiyanu
kŏmmalāla yīdam̐ḍu kakkūrdigām̐ḍu gadare

(||nāvaṁ||)
seri pilvavachchinanĕchchĕli tanaveḍugaṁṭā
yīrīdi nannu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
sārĕ nidi māyeligĕsāni viṁṭe nemiyanu
kārugŏnnajāṇagām̐ḍugadarĕ nem̐ḍidam̐ḍu