నావల్లఁ గడమేది నన్ను మన్నించి యాతఁడు
(॥పల్లవి॥)
నావల్లఁ గడమేది నన్ను మన్నించి యాతఁడు
యీవేళ విచ్చేసినదే యెన్నిక గాక
(॥నావ॥)
తలఁచ నెంతదడవు దవ్వుల నున్న పతినిఁ
బలికించుమంగే వసపడదుగాక
పిలువ నెంతదడవు పేరుకొని యాతని
అలమి చేపట్టుమంటే అందరుగాక
(॥నావ॥)
నవ్వఁగ నెంతదడవు నంటేసేసు కాతని
రవ్వగా బలిమిసేయ రాదుగాక
దువ్వఁగా నెంతదడవు దూరి యాతనిశిరసు
యవ్వల బత్తి గొట్టాన నిడరాదుగాక
(॥నావ॥)
కూడఁగ నెంతదడవు గురిసేసు కాతఁడు
వేడుకకు వెలలేక వింతాయఁగాక
యీడనే శ్రీవేంకటేశుఁ డింతలో నన్నుఁ గలసె(సి?)
ఆడుకొను సిగ్గువడి అలసేఁ గాక
(||pallavi||)
nāvallam̐ gaḍamedi nannu manniṁchi yādam̐ḍu
yīveḽa vichchesinade yĕnniga gāga
(||nāva||)
talam̐sa nĕṁtadaḍavu davvula nunna padinim̐
baligiṁchumaṁge vasabaḍadugāga
piluva nĕṁtadaḍavu perugŏni yādani
alami sebaṭṭumaṁṭe aṁdarugāga
(||nāva||)
navvam̐ga nĕṁtadaḍavu naṁṭesesu kādani
ravvagā balimiseya rādugāga
duvvam̐gā nĕṁtadaḍavu dūri yādaniśhirasu
yavvala batti gŏṭṭāna niḍarādugāga
(||nāva||)
kūḍam̐ga nĕṁtadaḍavu gurisesu kādam̐ḍu
veḍugagu vĕlalega viṁtāyam̐gāga
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannum̐ galasĕ(si?)
āḍugŏnu sigguvaḍi alasem̐ gāga