Naavallam gadama ledu nammidi ninnu

నావల్లఁ గడమ లేదు నమ్మితి నిన్ను
Language

(॥పల్లవి॥)
నావల్లఁ గడమ లేదు నమ్మితి నిన్ను
కైవసమై యీచెలినిఁ గరుణించు మిపుడు

(॥॥)
అలివేణి నిన్నుఁ బాసి అలసినఅలయిక
తెలిపి చెప్పితిఁ జుమ్మీ తెల్లమిగాను
చెలరేఁగి మీరు తొల్లి సేసుకొన్నబాసలు
తలఁపించితిఁ జుమ్మీ నేను తారుకాణగాను

(॥॥)
యేపున విరహవేళ నింతిపాన్పుపై చిగురు
చూపితిఁ జుమ్మీ నేను సూడిదెగాను
తీపులనీమోవి యిచ్చి తేకువ మన్నించుమని
చేపట్టి మొక్కితిఁ జుమ్మీ సెలవుగాను

(॥॥)
పోడిమి నిద్దరికిని పొందు సేసి కూడించి
వేఁడుకొంటిఁ జుమ్మీ నిన్ను వేడుకగాను
నేఁడు శ్రీ వేంకటేశుఁడ నీవే దయఁ గాచితివి
పేఁడితిఁ జుమ్మీ వలపు పెక్కువగాను

(||pallavi||)
nāvallam̐ gaḍama ledu nammidi ninnu
kaivasamai yīsĕlinim̐ garuṇiṁchu mibuḍu

(||||)
aliveṇi ninnum̐ bāsi alasinaalayiga
tĕlibi sĕppidim̐ jummī tĕllamigānu
sĕlarem̐gi mīru tŏlli sesugŏnnabāsalu
talam̐piṁchidim̐ jummī nenu tārugāṇagānu

(||||)
yebuna virahaveḽa niṁtibānpubai siguru
sūbidim̐ jummī nenu sūḍidĕgānu
tībulanīmovi yichchi teguva manniṁchumani
sebaṭṭi mŏkkidim̐ jummī sĕlavugānu

(||||)
poḍimi niddarigini pŏṁdu sesi kūḍiṁchi
vem̐ḍugŏṁṭim̐ jummī ninnu veḍugagānu
nem̐ḍu śhrī veṁkaḍeśhum̐ḍa nīve dayam̐ gāsidivi
pem̐ḍidim̐ jummī valabu pĕkkuvagānu