Naavalla nainadidi neevalla nayye dedo

నావల్ల నైనదిది నీవల్ల నయ్యే దేదో
Language

(॥పల్లవి॥)
నావల్ల నైనదిది నీవల్ల నయ్యే దేదో
యీ వేడుకలకు వెల యెఱఁగ నే నిఁకను

(॥నావ॥)
మంతనాలు నీతో నాడి మై ముట్టి సరసమాడి
యింతైతి నీ రట్టు ఇందరిలోన
దొంతి వెట్టేవు వలపు దోమటి దొడుక వచ్చే
వెంత సే సేవో నీవు యెఱఁగ నే నిఁకను

(॥నావ॥)
కప్పురవిడే లంది కన్నులఁ గానుకలంది
వుప్పతింపులలోనైతి వొద్దివారిచే
కుప్పలు సే సేవు నవ్వు గోరి మొనలు చూపేవు
యెప్పుడు చనవిచ్చేవే యెఱఁగ నే నిఁకను

(॥నావ॥)
చేతులు నీపై వేసి చెరఁగు నీపై వేసి
యేతులెల్లా నాడుకొంటి యీ చెలులలో
కాతరించి కూడితివి గక్కన శ్రీ వేంకటేశ
యీ తరితీపు లెన్నేశో యెఱఁగ నే నిఁకను

(||pallavi||)
nāvalla nainadidi nīvalla nayye dedo
yī veḍugalagu vĕla yĕṟam̐ga ne nim̐kanu

(||nāva||)
maṁtanālu nīdo nāḍi mai muṭṭi sarasamāḍi
yiṁtaidi nī raṭṭu iṁdarilona
dŏṁti vĕṭṭevu valabu domaḍi dŏḍuga vachche
vĕṁta se sevo nīvu yĕṟam̐ga ne nim̐kanu

(||nāva||)
kappuraviḍe laṁdi kannulam̐ gānugalaṁdi
vuppadiṁpulalonaidi vŏddivārise
kuppalu se sevu navvu gori mŏnalu sūbevu
yĕppuḍu sanavichcheve yĕṟam̐ga ne nim̐kanu

(||nāva||)
sedulu nībai vesi sĕram̐gu nībai vesi
yedulĕllā nāḍugŏṁṭi yī sĕlulalo
kādariṁchi kūḍidivi gakkana śhrī veṁkaḍeśha
yī taridību lĕnneśho yĕṟam̐ga ne nim̐kanu