నావలెనే నీవు నంటా నమ్మితి నేను
(॥పల్లవి॥)
నావలెనే నీవు నంటా నమ్మితి నేను
దేవర వవుత యింత తెలియరా నేను
(॥నావలెనే॥)
మంతనాన నాడినట్టి మాఁట లాకెతోఁ జెప్పి
పంతానకే నవ్వేవు పలుమారును
చింత మది దరికొని శిరసున వెళ్లఁ జొచ్చె
యింతే శవుతఁ దొల్లి యెరఁగరా నేను
(॥నావలెనే॥)
నే నిచ్చినపదకము నీ వాకె మెడఁ బెట్టి
పూని యెమ్మెలు చేసేవు పూటఁ పూఁటకు
కానీ లేరా అందు కేమి కాయ మెల్లా నుడికీని
యీ నీ గుణము నాఁడె యెంచ నైతి నేనూ
(॥నావలెనో॥)
పీఁటమీఁద నిన్నుఁ దెచ్చి పెట్టుకొంటే నీ వాపెను
పాటించి వద్ద బెట్టుక పాయఁగ లేవు
మాటాడి నే నలమేలుమంగ నంటాఁ గూడితివి
నీటున శ్రీవెంకటేశ నేరరా నేను
(||pallavi||)
nāvalĕne nīvu naṁṭā nammidi nenu
devara vavuda yiṁta tĕliyarā nenu
(||nāvalĕne||)
maṁtanāna nāḍinaṭṭi mām̐ṭa lāgĕdom̐ jĕppi
paṁtānage navvevu palumārunu
siṁta madi darigŏni śhirasuna vĕḽlam̐ jŏchchĕ
yiṁte śhavudam̐ dŏlli yĕram̐garā nenu
(||nāvalĕne||)
ne nichchinabadagamu nī vāgĕ mĕḍam̐ bĕṭṭi
pūni yĕmmĕlu sesevu pūḍam̐ pūm̐ṭagu
kānī lerā aṁdu kemi kāya mĕllā nuḍigīni
yī nī guṇamu nām̐ḍĕ yĕṁcha naidi nenū
(||nāvalĕno||)
pīm̐ṭamīm̐da ninnum̐ dĕchchi pĕṭṭugŏṁṭe nī vābĕnu
pāḍiṁchi vadda bĕṭṭuga pāyam̐ga levu
māḍāḍi ne nalamelumaṁga naṁṭām̐ gūḍidivi
nīḍuna śhrīvĕṁkaḍeśha nerarā nenu