Naavalene neevamtaa nammudum gaaga

నావలెనే నీవంటా నమ్ముదుఁ గాక
Language

(॥పల్లవి॥)
నావలెనే నీవంటా నమ్ముదుఁ గాక
పూవువంటి నీ గుణాలు పూఁపలయ్యీనా

(॥నావలె॥)
యెప్పటి నీవే కావా యెరఁగక మోహించి
చెప్పినట్టెల్లా నేనే సేతుఁ గాక
తప్పులెల్లా నీపాలు తాలిములే నాపాలు
నెప్పున నీవోజ యిఁక నీవు మానేవా

(॥నావలె॥)
నీ మాయలే కావా నిండుకొన్నవింతటాను
యేమిటాఁ దెలియలేక యిట్లైతిఁ గాక
కామించేది నాపాలు కపటాలు నీపాలు
సామాన నీచేఁతలు చక్కనయ్యీనా

(॥నావలె॥)
తక్కరివి నీవు గావా తారుకాణలిటు చూపి
వుక్కు మీరి నవ్వు నవ్వనోపఁ గాక
యెక్కువ శ్రీవేంకటేశ యేకమౌటే మనపాలు
నిక్కిన నీయాసలిఁక నేఁడు విడిచీనా

(||pallavi||)
nāvalĕne nīvaṁṭā nammudum̐ gāga
pūvuvaṁṭi nī guṇālu pūm̐palayyīnā

(||nāvalĕ||)
yĕppaḍi nīve kāvā yĕram̐gaga mohiṁchi
sĕppinaṭṭĕllā nene sedum̐ gāga
tappulĕllā nībālu tālimule nābālu
nĕppuna nīvoja yim̐ka nīvu mānevā

(||nāvalĕ||)
nī māyale kāvā niṁḍugŏnnaviṁtaḍānu
yemiḍām̐ dĕliyalega yiṭlaidim̐ gāga
kāmiṁchedi nābālu kabaḍālu nībālu
sāmāna nīsem̐talu sakkanayyīnā

(||nāvalĕ||)
takkarivi nīvu gāvā tārugāṇaliḍu sūbi
vukku mīri navvu navvanobam̐ gāga
yĕkkuva śhrīveṁkaḍeśha yegamauḍe manabālu
nikkina nīyāsalim̐ka nem̐ḍu viḍisīnā