నావలెఁ గావు నీవు నటనఁ బరాకే నీకు
(॥పల్లవి॥)
నావలెఁ గావు నీవు నటనఁ బరాకే నీకు
భావజుఁ డేకాంగి గాన పలుదొమ్మి కోపఁడో
(॥నావ॥)
వాకై నీఇంటికి నేవత్తుగాని నీవు రావు
యేకమనసులు గావు ఇది యేమొకో
మూకల మరునియమ్ము ముందు నన్నుఁ నాఁటినిన్నుఁ
గైకొని వెనక నాఁటఁ గడుమొద్ద వొయనో
(॥నావ॥)
నేనే తమకింతుఁ గాని నీవు తమకించవేర
పూవికె లొక్కటి గావు బుద్ది యేదొకో
మోనమున మరుకాఁక ముందు నన్నుఁ దాఁకి నిన్నుఁ
దానకమై సోఁకి యంతటఁ జల్లనారెనో
(॥నావ॥)
కిట్టి నేనే ను పరతికిని బోతిఁ గాక నీవు
పట్టి నాకిన్నిటాఁ గిందుపడితి విదె
యిట్టె శ్రీవేంకటేశ యెదుట మరుఁడు నన్ను
నెట్టనఁ గరుణఁ జూచి నిన్ను మరి చూచెనో
(||pallavi||)
nāvalĕm̐ gāvu nīvu naḍanam̐ barāge nīgu
bhāvajum̐ ḍegāṁgi gāna paludŏmmi kobam̐ḍo
(||nāva||)
vāgai nīiṁṭigi nevattugāni nīvu rāvu
yegamanasulu gāvu idi yemŏgo
mūgala maruniyammu muṁdu nannum̐ nām̐ṭininnum̐
gaigŏni vĕnaga nām̐ṭam̐ gaḍumŏdda vŏyano
(||nāva||)
nene tamagiṁtum̐ gāni nīvu tamagiṁchavera
pūvigĕ lŏkkaḍi gāvu buddi yedŏgo
monamuna marugām̐ka muṁdu nannum̐ dām̐ki ninnum̐
dānagamai som̐ki yaṁtaḍam̐ jallanārĕno
(||nāva||)
kiṭṭi nene nu paradigini bodim̐ gāga nīvu
paṭṭi nāginniḍām̐ giṁdubaḍidi vidĕ
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕduḍa marum̐ḍu nannu
nĕṭṭanam̐ garuṇam̐ jūsi ninnu mari sūsĕno