నావలె నుండవలదా ననిచి నీతో నవ్వుతా
(॥పల్లవి॥)
నావలె నుండవలదా ననిచి నీతో నవ్వుతా
చేవమీరి పరాకేల చేసుకొనీ నాపె
(॥నావ॥)
చనవిచ్చి నీవు గడుసరసము లాడఁగాను
పనివడి యేల సిగ్గులవడీ నాపె
పెనఁగి పెనఁగి నీవు ప్రియములు చెప్పఁగాను
విని విననెట్టు యేల వెరగందీ నాపె
(॥నావ॥)
పచ్చిగా నీవుచన్నులపైఁ జేయివేయఁగాను
కొచ్చి పయ్యదేల మూసుకొనీ నాపె
కచ్చుపెట్టి నీవు తన్నుఁ గాఁగిలించుకొనఁగాను
పెచ్చువెరిగి తానేల బిగిసీ నాపె
(॥నావ॥)
గట్టున నింటిలో నీవు కొంగువట్టి తియ్యఁగాను
పెట్టరానియానలేల పెట్టీ నాపె
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు
చుట్టుక తానేల కూడి సొలసీ నాపె
(||pallavi||)
nāvalĕ nuṁḍavaladā nanisi nīdo navvudā
sevamīri parāgela sesugŏnī nābĕ
(||nāva||)
sanavichchi nīvu gaḍusarasamu lāḍam̐gānu
panivaḍi yela siggulavaḍī nābĕ
pĕnam̐gi pĕnam̐gi nīvu priyamulu sĕppam̐gānu
vini vinanĕṭṭu yela vĕragaṁdī nābĕ
(||nāva||)
pachchigā nīvusannulabaim̐ jeyiveyam̐gānu
kŏchchi payyadela mūsugŏnī nābĕ
kachchubĕṭṭi nīvu tannum̐ gām̐giliṁchugŏnam̐gānu
pĕchchuvĕrigi tānela bigisī nābĕ
(||nāva||)
gaṭṭuna niṁṭilo nīvu kŏṁguvaṭṭi tiyyam̐gānu
pĕṭṭarāniyānalela pĕṭṭī nābĕ
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nīvu
suṭṭuga tānela kūḍi sŏlasī nābĕ