నావద్ద నున్నఁ దడవు నాఁటకాలేల
(॥పల్లవి॥)
నావద్ద నున్నఁ దడవు నాఁటకాలేల
నీ విధమే యిది యంతా నీవే బుద్దియ్యవోయి
(॥నావ॥)
వాసులకు నీపై నే వలపులు చల్లితేను
బేసబెల్లి తానేల పేఁడుకొనీని
ఆసపడితే వచ్చునా అవ్వలివారి సొమ్ము
నీసూటి మానిసి యాపె నీవే బుద్దియ్యవోయి
(॥నావ॥)
చనవున నీతో నేను సరసము లాడితేను
పనిమాలినాపె తాను పంతాలాడీని
పెనఁగితేఁ బుట్టునా ప్రియములు లోలోన
నినుఁ జుట్టుకొనీ నాపె నీవే బుద్దియ్యవోయి
(॥నావ॥)
జవ్వనాన నే నిన్ను సాదించి కూడితేను
పవ్వళించి తాను నట్టె పైకొనీని
యివ్వల శ్రీ వేంకటేశ యిద్దరము సరే నీకు
పువ్వక పూచె నీ కాపె బుద్దియ్య వోయి
(||pallavi||)
nāvadda nunnam̐ daḍavu nām̐ṭagālela
nī vidhame yidi yaṁtā nīve buddiyyavoyi
(||nāva||)
vāsulagu nībai ne valabulu sallidenu
besabĕlli tānela pem̐ḍugŏnīni
āsabaḍide vachchunā avvalivāri sŏmmu
nīsūḍi mānisi yābĕ nīve buddiyyavoyi
(||nāva||)
sanavuna nīdo nenu sarasamu lāḍidenu
panimālinābĕ tānu paṁtālāḍīni
pĕnam̐gidem̐ buṭṭunā priyamulu lolona
ninum̐ juṭṭugŏnī nābĕ nīve buddiyyavoyi
(||nāva||)
javvanāna ne ninnu sādiṁchi kūḍidenu
pavvaḽiṁchi tānu naṭṭĕ paigŏnīni
yivvala śhrī veṁkaḍeśha yiddaramu sare nīgu
puvvaga pūsĕ nī kābĕ buddiyya voyi