నావాఁడనేయంటా నమ్మించేవు నన్ను నేఁడు
(॥పల్లవి॥)
నావాఁడనేయంటా నమ్మించేవు నన్ను నేఁడు
చేవల నిన్నాపె చూచి సిగ్గువడనేలయ్యా
(॥॥)
మంతనాన నీవు నేను మాటలాడుకొన్న వెల్లా
ఇంతలోనె యాపె వినుటెట్లయ్యా
వింతలైననా మట్టెలు వేలఁ బెట్టుకొంటివి
వంతుల నాపె చేతికి వచ్చుటెట్లయ్యా
(॥॥)
పొందుగా నీవును నేనుఁ బూసుకొన్న పరిమళఁ
మందముగా నాపెమేన నంటు టెట్లయ్యా
కిందట మాయింట నారగించినకూరలచవులు
మందలించి యాపె చెప్పీ మర్మమేఁటిదయ్యా
(॥॥)
చెలరేఁగి నీరతులఁ జేసిననానేర్పులకు
నలువంక నాపె నిన్ను నగుటెట్లయ్యా
యెలమి శ్రీవేంకటేశ యిటు నన్నుఁగూడితివి
మెలుపున నిన్ను నాపె మెచ్చుటెట్లయ్యా
(||pallavi||)
nāvām̐ḍaneyaṁṭā nammiṁchevu nannu nem̐ḍu
sevala ninnābĕ sūsi sigguvaḍanelayyā
(||||)
maṁtanāna nīvu nenu māḍalāḍugŏnna vĕllā
iṁtalonĕ yābĕ vinuḍĕṭlayyā
viṁtalainanā maṭṭĕlu velam̐ bĕṭṭugŏṁṭivi
vaṁtula nābĕ sedigi vachchuḍĕṭlayyā
(||||)
pŏṁdugā nīvunu nenum̐ būsugŏnna parimaḽam̐
maṁdamugā nābĕmena naṁṭu ṭĕṭlayyā
kiṁdaḍa māyiṁṭa nāragiṁchinagūralasavulu
maṁdaliṁchi yābĕ sĕppī marmamem̐ṭidayyā
(||||)
sĕlarem̐gi nīradulam̐ jesinanānerbulagu
naluvaṁka nābĕ ninnu naguḍĕṭlayyā
yĕlami śhrīveṁkaḍeśha yiḍu nannum̐gūḍidivi
mĕlubuna ninnu nābĕ mĕchchuḍĕṭlayyā