Naavaamdaneyamtaa nammiga lichchevu naagu

నావాఁడనేయంటా నమ్మిక లిచ్చేవు నాకు
Language

(॥పల్లవి॥)
నావాఁడనేయంటా నమ్మిక లిచ్చేవు నాకు
కైవసమైతేఁ జాలు కాదనేనా నిన్నును

(॥నావాఁడ॥)
వేడుకలు వెదచల్లి వేగినంతా నాపె నిన్ను
వాడికలెల్లాఁజూపి వావి చెప్పెను
వీడుదోడై విందువెట్టి వీడెము చేతికిచ్చె
వాడసతులకు నీవు వలచేవే యిఁకను

(॥నావాఁడ॥)
సంగాతాలు సేసి నీతో సరసములాడి యాకె
సింగారించి మర్మాలంటి చిమ్మిరేఁచెను
చెంగటఁ గూచుండి నీచిత్త మిట్టె కరఁగించె
అంగడివారి పొందు లసించేవా ఇఁకను

(॥నావాఁడ॥)
ఇచ్చకము సేసి నీకు నెంగిలిమోవి యిచ్చి
మచ్చువేసినట్టు నిన్ను మరిగించెను
యిచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
తచ్చనకాంతలపొందు తలఁచేవా యిఁకను

(||pallavi||)
nāvām̐ḍaneyaṁṭā nammiga lichchevu nāgu
kaivasamaidem̐ jālu kādanenā ninnunu

(||nāvām̐ḍa||)
veḍugalu vĕdasalli veginaṁtā nābĕ ninnu
vāḍigalĕllām̐jūbi vāvi sĕppĕnu
vīḍudoḍai viṁduvĕṭṭi vīḍĕmu sedigichchĕ
vāḍasadulagu nīvu valaseve yim̐kanu

(||nāvām̐ḍa||)
saṁgādālu sesi nīdo sarasamulāḍi yāgĕ
siṁgāriṁchi marmālaṁṭi simmirem̐sĕnu
sĕṁgaḍam̐ gūsuṁḍi nīsitta miṭṭĕ karam̐giṁchĕ
aṁgaḍivāri pŏṁdu lasiṁchevā im̐kanu

(||nāvām̐ḍa||)
ichchagamu sesi nīgu nĕṁgilimovi yichchi
machchuvesinaṭṭu ninnu marigiṁchĕnu
yichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
tachchanagāṁtalabŏṁdu talam̐sevā yim̐kanu