నావాఁడనేయంటా నాకింత దెలుపనేల
(॥పల్లవి॥)
నావాఁడనేయంటా నాకింత దెలుపనేల
కైవశమై వున్నాఁడవు కాంత లిదెరఁగరా
(॥నావాఁ॥)
ఆనవెట్టకు నీమీఁద నట్టె వరవాతును
కానీలే నీ నిజమెల్లాఁ గనేముగాక
నానఁ బెట్టకు నవ్వులు నడుమ సెలవులను
యీనీజాణతనము లిందరు నెఱఁగరా
(॥నావాఁ॥)
పట్టకు మాచన్నులు పైపైఁ బెరిగేపొద్దు
అట్టె దాష్టీకుఁడ వైతే నౌదువుగాని
గుట్టుతోఁ దలవంచకు గుబ్బతిలె వలపులు
నెట్టుకొన్న దొరవౌత నెలఁత లెఱఁగరా
(॥నావాఁ॥)
పెనఁగులాడ కంతేసి బెట్టుగా మే నలసీని
యెనసితివి కోరికె లీడేరీఁ గాని
ఘనుఁడ నే నలమేల్మంగను శ్రీవేంకటేశ్వర
నను నీవు మన్నించేది నాతులెఱఁగరా
(||pallavi||)
nāvām̐ḍaneyaṁṭā nāgiṁta dĕlubanela
kaivaśhamai vunnām̐ḍavu kāṁta lidĕram̐garā
(||nāvām̐||)
ānavĕṭṭagu nīmīm̐da naṭṭĕ varavādunu
kānīle nī nijamĕllām̐ ganemugāga
nānam̐ bĕṭṭagu navvulu naḍuma sĕlavulanu
yīnījāṇadanamu liṁdaru nĕṟam̐garā
(||nāvām̐||)
paṭṭagu māsannulu paibaim̐ bĕrigebŏddu
aṭṭĕ dāṣhṭīgum̐ḍa vaide nauduvugāni
guṭṭudom̐ dalavaṁchagu gubbadilĕ valabulu
nĕṭṭugŏnna dŏravauda nĕlam̐ta lĕṟam̐garā
(||nāvām̐||)
pĕnam̐gulāḍa kaṁtesi bĕṭṭugā me nalasīni
yĕnasidivi korigĕ līḍerīm̐ gāni
ghanum̐ḍa ne nalamelmaṁganu śhrīveṁkaḍeśhvara
nanu nīvu manniṁchedi nādulĕṟam̐garā