Naavaamda vani ninnu nammi yumdunu

నావాఁడ వని నిన్ను నమ్మి యుందును
Language

(॥పల్లవి॥)
నావాఁడ వని నిన్ను నమ్మి యుందును
యీవేళ నాతోనె యింత గలదా

(॥నావాడ॥)
రావద్దా నీవు నేఁడు రమణుఁడ మాయింటికి
కావిరి నీకు నేము కడవారమా
సోవల నెగ్గులు లేవు చుట్టపువరుసే నాకు
నీ వెరఁగనితగవు నీకుఁ జెప్పేమా

(॥నావాడ॥)
చెప్ప వద్దా నీవు నాకుఁ జేసేపనుల కెల్ల
నెప్పు డైన నేము నీకు నెదు రాడేమా
తప్పించుకోఁ బని లేదు తగుల మైనచోట
ముప్పిరి నీకు వలపు మోపు గట్టేమా

(॥నావాడ॥)
కూడ వద్దా నీకు నీవే కొంగు వట్టి నన్ను నేఁడు
జాడ దప్పి నీకు మెచ్చనివారమా
యీడనె శ్రీవెంకటేశ యింత సేసి కలసితి
వేడుక నీచేఁతలకు వెగ్గళించేమా

(||pallavi||)
nāvām̐ḍa vani ninnu nammi yuṁdunu
yīveḽa nādonĕ yiṁta galadā

(||nāvāḍa||)
rāvaddā nīvu nem̐ḍu ramaṇum̐ḍa māyiṁṭigi
kāviri nīgu nemu kaḍavāramā
sovala nĕggulu levu suṭṭabuvaruse nāgu
nī vĕram̐ganidagavu nīgum̐ jĕppemā

(||nāvāḍa||)
sĕppa vaddā nīvu nāgum̐ jesebanula kĕlla
nĕppu ḍaina nemu nīgu nĕdu rāḍemā
tappiṁchugom̐ bani ledu tagula mainasoḍa
muppiri nīgu valabu mobu gaṭṭemā

(||nāvāḍa||)
kūḍa vaddā nīgu nīve kŏṁgu vaṭṭi nannu nem̐ḍu
jāḍa dappi nīgu mĕchchanivāramā
yīḍanĕ śhrīvĕṁkaḍeśha yiṁta sesi kalasidi
veḍuga nīsem̐talagu vĕggaḽiṁchemā