Naaraayanuni divyanaamamu dalamsalega

నారాయణుని దివ్యనామము దలఁచలేక
Language

(॥పల్లవి॥)
నారాయణుని దివ్యనామము దలఁచలేక
వూరకిళ్లఁ దేరకిళ్ల(?) కొడిగట్టుఁ బ్రాణి

(॥నారా॥)
వెనక జన్మించేనాఁడు వీసమైనఁ గొనిరాఁడు
తనువు విడుచునాఁడు తారముఁ గొంపోఁడు
మొనచూపి నడుమంత్రమునఁ దిరుగాడేటి
కనకముకు సొమ్మని కాచుకుండుఁ బ్రాణి

(॥నారా॥)
వుండక పొయ్యేటి వెల్లా వొకఁడు నిలుపలేఁడు
అండనె వచ్చేటి వెల్లా అడ్డగించలేఁడు
బండు బండై యిందుకుఁగాఁ బరులు రక్షకులంటా
గుండె లేకెవ్వరికైనాఁ గొంచపడుఁ బ్రాణి

(॥నారా॥)
వడి నిట్టే పనులకు వగవఁగ బని లేదు
జడియు సంసారక మొక్క సరవి గాదు
విడువని విభుఁడు శ్రీవేంకటేశుఁ డుండఁగాను
తడవి లే పట్టలేక తమకించుఁ బ్రాణి

(||pallavi||)
nārāyaṇuni divyanāmamu dalam̐salega
vūragiḽlam̐ deragiḽla(?) kŏḍigaṭṭum̐ brāṇi

(||nārā||)
vĕnaga janmiṁchenām̐ḍu vīsamainam̐ gŏnirām̐ḍu
tanuvu viḍusunām̐ḍu tāramum̐ gŏṁpom̐ḍu
mŏnasūbi naḍumaṁtramunam̐ dirugāḍeḍi
kanagamugu sŏmmani kāsuguṁḍum̐ brāṇi

(||nārā||)
vuṁḍaga pŏyyeḍi vĕllā vŏgam̐ḍu nilubalem̐ḍu
aṁḍanĕ vachcheḍi vĕllā aḍḍagiṁchalem̐ḍu
baṁḍu baṁḍai yiṁdugum̐gām̐ barulu rakṣhagulaṁṭā
guṁḍĕ legĕvvarigainām̐ gŏṁchabaḍum̐ brāṇi

(||nārā||)
vaḍi niṭṭe panulagu vagavam̐ga bani ledu
jaḍiyu saṁsāraga mŏkka saravi gādu
viḍuvani vibhum̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍuṁḍam̐gānu
taḍavi le paṭṭalega tamagiṁchum̐ brāṇi