Naaraayanaachyudaanamta govimdaa

నారాయణాచ్యుతానంత గోవిందా
Language

(॥పల్లవి॥)
నారాయణాచ్యుతానంత గోవిందా
నేరరాదు విజ్ఞానము నీ వియ్యక లేదు

(॥నారా॥)
నిగమాంతవిదులై తే నిన్నెఱుఁగుదురు గాక
మృగసమానులకేల మీమీఁది భక్తి
వెగటుగాఁ గృపతోడ విశ్వరూపు చూపినాను
పగటు దుర్యోధనుఁడు బహురూప మనఁడా

(॥నారా॥)
చిరపుణ్యులైతే మీ సేవలు సేతురు గాక
దురితచిత్తులకు మీత్రోవ యేఁటికి
గరిమఁ బ్రత్యక్షమై కంబములోఁ గలిగినా
హిరణ్యకశిపుఁడు మిమ్మెంచి శరణనెనా

(॥నారా॥)
దేవతలయితే మిమ్ముఁ దెలియనేర్తురు గాక
యేవల నసురులు మిమ్మెఱిఁగేరా
శ్రీవేంకటాద్రిమీఁద సిరితో నీ వుండఁగాను
కేవల సంసారు లెఱిఁగియును మఱవరా

(||pallavi||)
nārāyaṇāchyudānaṁta goviṁdā
nerarādu vijñānamu nī viyyaga ledu

(||nārā||)
nigamāṁtavidulai te ninnĕṟum̐guduru gāga
mṛgasamānulagela mīmīm̐di bhakti
vĕgaḍugām̐ gṛpadoḍa viśhvarūbu sūbinānu
pagaḍu duryodhanum̐ḍu bahurūba manam̐ḍā

(||nārā||)
sirabuṇyulaide mī sevalu seduru gāga
duridasittulagu mītrova yem̐ṭigi
garimam̐ bratyakṣhamai kaṁbamulom̐ galiginā
hiraṇyagaśhibum̐ḍu mimmĕṁchi śharaṇanĕnā

(||nārā||)
devadalayide mimmum̐ dĕliyanerduru gāga
yevala nasurulu mimmĕṟim̐gerā
śhrīveṁkaḍādrimīm̐da sirido nī vuṁḍam̐gānu
kevala saṁsāru lĕṟim̐giyunu maṟavarā