నారాయణ నీవే నాథుఁడవైతి నాకు
(॥పల్లవి॥)
నారాయణ నీవే నాథుఁడవైతి నాకు
గారవించి రక్షించి కరుణించవయ్యా
(॥నారా॥)
అంచట నా కర్మమనే అలుగు బండారించితి
పెంచి యింద్రియాలఁ బంపు వెట్టకుమయ్య
వంచి పుణ్యముల మేఁడి వారము మీ కిచ్చితిమి
మించిన కామాదులనే మేర గాండ్లేలయ్య
(॥నారా॥)
మునుసే ఆసలనేటి మొదలు గడమ చెల్లె
పనివూని పాతకపు పనులేలయ్య
మనసనే మోపు నెమ్మది నీకు నప్పగించితి
ఘన దుఃఖముల తర కాండ్లేలయ్యా
(॥నారా॥)
శ్రీ వేంకటేశ నీ భక్తిసీమకు నే నేలికైతి
తావుల చింతల దరిద్రము లేలయ్య
నీవు నాకుఁ గాణాచి నే నీ యాధీనము
వోవల పరధర్మపు దొత్తు కాండ్లేలయ్య
(||pallavi||)
nārāyaṇa nīve nāthum̐ḍavaidi nāgu
gāraviṁchi rakṣhiṁchi karuṇiṁchavayyā
(||nārā||)
aṁchaḍa nā karmamane alugu baṁḍāriṁchidi
pĕṁchi yiṁdriyālam̐ baṁpu vĕṭṭagumayya
vaṁchi puṇyamula mem̐ḍi vāramu mī kichchidimi
miṁchina kāmādulane mera gāṁḍlelayya
(||nārā||)
munuse āsalaneḍi mŏdalu gaḍama sĕllĕ
panivūni pādagabu panulelayya
manasane mobu nĕmmadi nīgu nappagiṁchidi
ghana duḥkhamula tara kāṁḍlelayyā
(||nārā||)
śhrī veṁkaḍeśha nī bhaktisīmagu ne neligaidi
tāvula siṁtala daridramu lelayya
nīvu nāgum̐ gāṇāsi ne nī yādhīnamu
vovala paradharmabu dŏttu kāṁḍlelayya