నారాయణ నీ పంపో నా భాగ్యమో ఇది
(॥పల్లవి॥)
నారాయణ నీ పంపో నా భాగ్యమో ఇది
పేరుకొని పిలువని పేరటమై వున్నది
(॥నారా॥)
వుడిగినాఁ గామాదు లొక్కొక్కవ్యాజాన వచ్చీ
నుడిసి నడుముచొచ్చు చుట్టాలవలె
తడవకున్నాఁ గర్మాలు తమ్ముఁ దామె సేయించీ
బడిబడిఁ దిరుగును బంట్లవలె
(॥నారా॥)
చూడకున్నా దుర్గుణాలు సొంట్లు సోదించవచ్చీ
వాడవాడలఁ దలవరులవలె
యేడ నున్నా లంపటాలు యెదుటనే పొలసీని
జోడువాయనీక తోడునీడలవలె
(॥నారా॥)
తలఁచకున్నా భోగాలు తనువుతోఁ బెనఁగీని
చెలరేఁగి గరిడిలో జెట్లవలె
బలిమి శ్రీవేంకటేశ భావములో నీమూరితి
నిలుపవే యెందుకైనా నిగిడీ నామనసు
(||pallavi||)
nārāyaṇa nī paṁpo nā bhāgyamo idi
perugŏni piluvani peraḍamai vunnadi
(||nārā||)
vuḍiginām̐ gāmādu lŏkkŏkkavyājāna vachchī
nuḍisi naḍumusŏchchu suṭṭālavalĕ
taḍavagunnām̐ garmālu tammum̐ dāmĕ seyiṁchī
baḍibaḍim̐ dirugunu baṁṭlavalĕ
(||nārā||)
sūḍagunnā durguṇālu sŏṁṭlu sodiṁchavachchī
vāḍavāḍalam̐ dalavarulavalĕ
yeḍa nunnā laṁpaḍālu yĕduḍane pŏlasīni
joḍuvāyanīga toḍunīḍalavalĕ
(||nārā||)
talam̐sagunnā bhogālu tanuvudom̐ bĕnam̐gīni
sĕlarem̐gi gariḍilo jĕṭlavalĕ
balimi śhrīveṁkaḍeśha bhāvamulo nīmūridi
nilubave yĕṁdugainā nigiḍī nāmanasu