నానారూపధరుఁడు నారాయణుఁడు వీఁడె
(॥పల్లవి॥)
నానారూపధరుఁడు నారాయణుఁడు వీఁడె
పూనిన వుపమలెల్లాఁ బొసఁగె నితనికి
(॥నానా॥)
గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని
సొరిది సముద్రము చొచ్చినయట్లు
పురుషసూక్తమున విప్రులు సేసే మజ్జనము
అరుదుగఁ బన్నీరెల్లా నమరే నీహరికి
(॥నానా॥)
అట్టే వెల్లమొయిళ్లు ఆకసాన నిండినట్టు
గట్టిగా మేన నిండెను కప్పురకాపు
వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు
తట్టుపుణుఁ గమరెను దైవాలరాయనికి
(॥నానా॥)
నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు
తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు
అలమేలుమంగ వురమున నెలకొనె నిదే
చెలరేఁగి శృంగారాల శ్రీవేంకటేశునకు
(||pallavi||)
nānārūbadharum̐ḍu nārāyaṇum̐ḍu vīm̐ḍĕ
pūnina vubamalĕllām̐ bŏsam̐gĕ nidanigi
(||nānā||)
garima nerulu vānagālamunam̐ bĕnagŏni
sŏridi samudramu sŏchchinayaṭlu
puruṣhasūktamuna viprulu sese majjanamu
arudugam̐ bannīrĕllā namare nīharigi
(||nānā||)
aṭṭe vĕllamŏyiḽlu āgasāna niṁḍinaṭṭu
gaṭṭigā mena niṁḍĕnu kappuragābu
vŏṭṭi tana viṣhṇumāya vŏḍalibai vālinaṭṭu
taṭṭubuṇum̐ gamarĕnu daivālarāyanigi
(||nānā||)
niluvuna saṁpadalu nilisi rūbainaṭṭu
tĕlivi sŏmmulabĕṭṭĕ dĕrasinaṭṭu
alamelumaṁga vuramuna nĕlagŏnĕ nide
sĕlarem̐gi śhṛṁgārāla śhrīveṁkaḍeśhunagu