నానాఁడు నిన్నుఁ దగిలే నాకే కాక
(॥పల్లవి॥)
నానాఁడు నిన్నుఁ దగిలే నాకే కాక
యేనుఁగుతో యేలాటాలు యెవ్వరి కేలోయి
(॥నానా॥)
యెలుఁ గెత్తి పిలువఁగ నేమి సేసేవోయి నీవు
అలరి నా కంటెఁ జుట్టా లాడ నున్నారా
వలపు మురుగఁ బెట్టి వట్టిగడ్డెలు వేసితే
యెలమి నాకడివారి కేమి భాఁతి వోయి
(॥నానా॥)
చేయి వట్టి తియ్యఁగాను చెంగి దిక్కులు చూచేవు
యేయడ నిన్నేలినవా రింక నున్నారా
పాయము ముంగిట వేసి పరుల కేఁకరితేను
చాయల వింత వారికి సుద్ద యేఁటి కోయి
(॥నానా॥)
కాఁగిట నిన్నుఁ గూడితే గక్కనను భ్రమసేవు
వీఁగక నిన్నింతసేయ వేరే వున్నారా
మాఁగినమోవి చూపి మచ్చులు వేసితేను
పాఁగినశ్రీ వేంకటేశ పదరేరా వోయి
(||pallavi||)
nānām̐ḍu ninnum̐ dagile nāge kāga
yenum̐gudo yelāḍālu yĕvvari keloyi
(||nānā||)
yĕlum̐ gĕtti piluvam̐ga nemi sesevoyi nīvu
alari nā kaṁṭĕm̐ juṭṭā lāḍa nunnārā
valabu murugam̐ bĕṭṭi vaṭṭigaḍḍĕlu veside
yĕlami nāgaḍivāri kemi bhām̐ti voyi
(||nānā||)
seyi vaṭṭi tiyyam̐gānu sĕṁgi dikkulu sūsevu
yeyaḍa ninnelinavā riṁka nunnārā
pāyamu muṁgiḍa vesi parula kem̐karidenu
sāyala viṁta vārigi sudda yem̐ṭi koyi
(||nānā||)
kām̐giḍa ninnum̐ gūḍide gakkananu bhramasevu
vīm̐gaga ninniṁtaseya vere vunnārā
mām̐ginamovi sūbi machchulu vesidenu
pām̐ginaśhrī veṁkaḍeśha padarerā voyi